Telugu Global
NEWS

కృష్ణమ్మకు.... వేలాది ఇసుక బస్తాలను అడ్డుపెడుతున్న.... చంద్రబాబు

కృష్ణానది వరద… కరకట్టపై ఉన్న అక్రమ నిర్మాణ దారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. ఇప్పటికే వరద నీరు అక్రమ కట్టడాల వరకూ సమీపించింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు నివాసం ఉంటున్న లింగమనేని భవనం హాట్ టాఫిక్‌గా మారింది. చంద్రబాబు ఇంటిని వదిలేసి హైదరాబాద్ వెళ్లిపోయారు. ఆయన కార్లను, కాన్వాయ్‌ని మరో చోటికి తరలించారు. కింది అంతస్తులోని వస్తువులను పై అంతస్తుకు తరలించారు. శ్రీశైలం వద్ద 8 లక్షల క్యూసెక్కులకు పైగా వరద ఉంది. ఆ వరద వచ్చినది వచ్చినట్టుగా ప్రకాశం […]

కృష్ణమ్మకు.... వేలాది ఇసుక బస్తాలను అడ్డుపెడుతున్న.... చంద్రబాబు
X

కృష్ణానది వరద… కరకట్టపై ఉన్న అక్రమ నిర్మాణ దారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. ఇప్పటికే వరద నీరు అక్రమ కట్టడాల వరకూ సమీపించింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు నివాసం ఉంటున్న లింగమనేని భవనం హాట్ టాఫిక్‌గా మారింది.

చంద్రబాబు ఇంటిని వదిలేసి హైదరాబాద్ వెళ్లిపోయారు. ఆయన కార్లను, కాన్వాయ్‌ని మరో చోటికి తరలించారు. కింది అంతస్తులోని వస్తువులను పై అంతస్తుకు తరలించారు.

శ్రీశైలం వద్ద 8 లక్షల క్యూసెక్కులకు పైగా వరద ఉంది. ఆ వరద వచ్చినది వచ్చినట్టుగా ప్రకాశం బ్యారేజ్‌ దాటితే లింగమనేని భవనం మునిగిపోవడం ఖాయమని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ వద్ద 4.2 లక్షల క్యూసెక్కుల ప్రవాహం ఉండగానే లింగమనేని భవనానికి దగ్గరగా కృష్ణమ్మ వచ్చేసింది.

ఇప్పుడు కూడా నది ప్రవాహాన్ని ఎదుర్కొనేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. వరద నేరుగా తన ఇంటిని తాకకుండా వేలాది ఇసుక బస్తాలను అడ్డుగా వేయిస్తున్నారు. ఇసుకను భారీగా ట్రాక్టర్లతో చంద్రబాబు ఇంటి వద్దకు తరలిస్తున్నారు.

చంద్రబాబు నివాసం వద్ద నది ప్రవాహాన్ని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పరిశీలించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోలీసులు తమను కనీసం నది వద్దకు కూడా రానిచ్చేవారు కాదని ఆర్కే చెప్పారు.

ఇప్పటికైనా చంద్రబాబు తక్షణం ఇంటిని ఖాళీ చేసి చట్టాలను గౌరవించాలని సూచించారు. తన ఇంటికి వరద ముప్పు తప్పదని తెలుసుకుని చంద్రబాబు హైదరాబాద్ పారిపోయారని ఎద్దేవా చేశారు. కృష్ణమ్మనే అడ్డుకునేలా ఇప్పుడు 10వేల ఇసుక బస్తాలను ఇంటి చుట్టూ చంద్రబాబు వేయిస్తున్నారని ఆర్కే వివరించారు.

First Published:  14 Aug 2019 3:50 AM GMT
Next Story