Telugu Global
National

విఫలమైన ఏటీఎం లావాదేవీలు లెక్కించవద్దు....

ఏటీఎం వినియోగదారులకు ఊరటనిచ్చేలా బ్యాంకులకు ఆర్‌బీఐ మార్గదర్శకాలు జారీ చేసింది. ఇకపై విఫలమైన ఏటీఎం లావాదేవీలను లెక్కించవద్దని ఆదేశాలు జారీ చేసింది. ప్రతి నెలా బ్యాంకులు వినియోగదారులకు నిర్ణత పరిధిలోనే ఉచిత సేవలు అందిస్తున్నాయి. అవి దాటిన తర్వాత ఏటీఎంను వాడితే అందుకు చార్జీ వసూలు చేస్తోంది. ఏటీఎంలో డబ్బు లేకపోయినా, ఏటీఎంలో సాంకేతిక లోపాల వల్ల లావాదేవీలు జరపలేకపోయినా సరే వాటిని కూడా బ్యాంకులు లెక్కిస్తున్నాయి. దీనిపై ఆర్‌బీఐకి అనేక ఫిర్యాదులు వెళ్లాయి. ఈ నేపథ్యంలో […]

విఫలమైన ఏటీఎం లావాదేవీలు లెక్కించవద్దు....
X

ఏటీఎం వినియోగదారులకు ఊరటనిచ్చేలా బ్యాంకులకు ఆర్‌బీఐ మార్గదర్శకాలు జారీ చేసింది. ఇకపై విఫలమైన ఏటీఎం లావాదేవీలను లెక్కించవద్దని ఆదేశాలు జారీ చేసింది.

ప్రతి నెలా బ్యాంకులు వినియోగదారులకు నిర్ణత పరిధిలోనే ఉచిత సేవలు అందిస్తున్నాయి. అవి దాటిన తర్వాత ఏటీఎంను వాడితే అందుకు చార్జీ వసూలు చేస్తోంది. ఏటీఎంలో డబ్బు లేకపోయినా, ఏటీఎంలో సాంకేతిక లోపాల వల్ల లావాదేవీలు జరపలేకపోయినా సరే వాటిని కూడా బ్యాంకులు లెక్కిస్తున్నాయి. దీనిపై ఆర్‌బీఐకి అనేక ఫిర్యాదులు వెళ్లాయి. ఈ నేపథ్యంలో ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది.

సాంకేతిక కారణాల వల్ల లావాదేవీలు విఫలం కావడం, నగదు లేక డబ్బు రాకపోవడం వంటి లావాదేవీలను లెక్కలోకి తీసుకోవద్దని స్పష్టం చేసింది. హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్, కమ్యూనికేషన్ సమస్యలు, ఏటీఎంలలో కరెన్సీ అందుబాటులో లేకపోవడం వంటి సాంకేతిక కారణాల వల్ల విఫలమయ్యే లావాదేవీలను చెల్లుబాటు అయ్యే లావాదేవీలుగా పరిగణించరాదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాలు జారీ చేసింది. కస్టమర్లనుంచి ఇందుకోసం ఎలాంటి ఛార్జీ వసూలు చేయరాదని ఆర్‌బీఐ ప్రకటనలో పేర్కొంది.

ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, పట్టణ సహకార బ్యాంకులు, రాష్ట్ర సహకార బ్యాంకులు, జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు, చిన్న ఫైనాన్స్ బ్యాంకులు, చెల్లింపు బ్యాంకులు, వైట్-లేబుల్ ఏటీఎం ఆపరేటర్లతో సహా అన్ని వాణిజ్య బ్యాంకులకు కూడా ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

First Published:  15 Aug 2019 12:50 AM GMT
Next Story