Telugu Global
National

తెలంగాణలో రెడ్లు.... ఆంధ్రాలో కమ్మ.... బీజేపీ టార్గెట్

తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్ర్రప్రదేశ్ లలో బలమైన సామాజిక వర్గాలపై భారతీయ జనతా పార్టీ కన్ను వేసింది. తెలంగాణలో రెడ్డి సామాజిక వర్గం, ఆంధ్రప్రదేశ్ లో కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలను బిజేపీలోకి తీసుకురావడమే ధ్యేయంగా పావులు కదుపుతోంది. తెలంగాణలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకులు ఇన్నాళ్లూ కాంగ్రెస్ పక్షాన ఉన్నారు. వారిలో కొందరిని బిజేపీలోకి తీసుకువచ్చే పనిని ప్రారంభించింది కమలదళం. తెలంగాణలో అధికారంలో ఉన్న వెలమలకు, రెడ్లకు మధ్య చాలా కాలంగా విభేదాలు […]

తెలంగాణలో రెడ్లు.... ఆంధ్రాలో కమ్మ.... బీజేపీ టార్గెట్
X

తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్ర్రప్రదేశ్ లలో బలమైన సామాజిక వర్గాలపై భారతీయ జనతా పార్టీ కన్ను వేసింది. తెలంగాణలో రెడ్డి సామాజిక వర్గం, ఆంధ్రప్రదేశ్ లో కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలను బిజేపీలోకి తీసుకురావడమే ధ్యేయంగా పావులు కదుపుతోంది.

తెలంగాణలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకులు ఇన్నాళ్లూ కాంగ్రెస్ పక్షాన ఉన్నారు. వారిలో కొందరిని బిజేపీలోకి తీసుకువచ్చే పనిని ప్రారంభించింది కమలదళం. తెలంగాణలో అధికారంలో ఉన్న వెలమలకు, రెడ్లకు మధ్య చాలా కాలంగా విభేదాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలో ఉన్న రెడ్లు వెలమల దొరతనాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇన్నాళ్లూ తెలంగాణలోని రెడ్డి సామాజిక వర్గం కాంగ్రెస్ పార్టీని నమ్ముకుంది. అయితే కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా నిర్వీర్యం అవుతున్న దశలో బిజేపీయే ప్రత్యామ్నయంగా భావిస్తోంది. దీంతో రెడ్డి సామాజిక వర్గాన్ని ఆకర్షించేందుకు కమలనాథులు ముమ్మరంగా ప్రయత్నిస్తునట్లు సమాచారం.

ఇప్పటికే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన డి.కే అరుణ బిజేపీలో చేరారు. కాంగ్రెస్ కు చెందిన మరో నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల రెడ్డి కూడ బిజేపీలో చేరుతారని వార్తలు వస్తున్నాయి. మరో సీనియర్ నాయకుడు రేవంత్ రెడ్డి కూడా కమలం వైపే చూస్తున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో రెడ్డి సామాజిక వర్గాన్ని బిజేపీ వైపు తిప్పుకునేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తోంది.

ఇక ఆంధ్రప్రదేశ్ లో బలమైన సామాజిక వర్గంగా పేరున్న కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాయకులను బిజేపీలోకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇన్నాళ్లూ కమ్మ సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీతో ఉంది. ఆ పార్టీ అధికారాన్ని కోల్పోవడంతో కమ్మ సామాజిక వర్గం నేతలు బిజేపీ వైపు చూస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో రెడ్డి సామాజిక వర్గం కాంగ్రెస్ వైపు ఉండేది. వారంతా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ లో ఉన్నారు. కమ్మ సామాజిక వర్గానికి తమది అనుకునే పార్టీ లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఆ సామాజిక వర్గానికి చెందిన నాయకులను బిజేపీలోకి తీసుకుని వచ్చేందుకు కమలనాథులు పావులు కదుపుతున్నారు. ఇప్పటికే దగ్గుబాటి పురంధ్రీశ్వరి, సుజనా చౌదరి వంటి వారు ఏపీ బిజేపీలో కీలక నేతలుగా మారారు. వీరిద్దరూ కమ్మ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నాయకులతో చర్చలు జరుపుతన్నట్లు సమాచారం.

First Published:  14 Aug 2019 7:03 PM GMT
Next Story