హరీష్ శంకర్ దర్శకత్వం లో చిరంజీవి?

హరీష్ శంకర్ ప్రస్తుతం వరుణ్ తేజ్ తో వాల్మీకి అనే సినిమా తో బిజీ గా ఉన్నాడు. ఈ సినిమా వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా ని త్వరగా ఫినిష్ చేసి తదుపరి ప్రాజెక్ట్ కి సంబంధించిన స్క్రిప్ట్ మీద కూర్చోవాలని హరీష్ భావిస్తున్నాడు.

అయితే హరీష్ శంకర్ ఎప్పటి నుంచో చిరంజీవి తో కలిసి పని చేయాలని అనుకుంటున్నాడు. ఇదే విషయాన్ని చాలా సార్లు చెప్పాడు. కాకపోతే ఇప్పుడు ఫిలిం నగర్ లో వినిపిస్తున్న వార్తలేంటంటే…. హరీష్ శంకర్ ని చిరంజీవి కథ చెప్పమన్నాడట.

వాల్మీకి విడుదల అయ్యాక ఒక రోజు వచ్చి హరీష్ శంకర్ ని కథ చెప్పమని చిరంజీవి చెప్పాడట. హరీష్ ఈ విషయం తెలుసుకొని చాలా సంతోషం గా ఉన్నాడు. ఈ విషయాన్ని హరీష్ ఓపెన్ గా చెప్పకపోయినా ట్విట్టర్ లో ఇండైరెక్ట్ గా చెప్పేసాడు. త్వరలో నే ఒక మెగా ప్రాజెక్ట్ రానుంది అనే విషయాన్ని స్పష్టం చేశారు. మెగాస్టార్ ని ఒక మాస్ సినిమా లో తనదైన స్టైల్ లో చూపించాలని హరీష్ అనుకుంటున్నాడు.