Telugu Global
National

రక్షణ వ్యవస్థ లో కీలక పదవి ప్రకటన

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఓ ముఖ్యమైన ప్రకటన చేశారు. ఎర్రకోట మీద నుంచి మాట్లాడుతూ మన త్రివిధ దళాలకు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సి డి ఎస్)ని నియమించనున్నట్లు చెప్పారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్…. సైన్యం, నౌకాదళం, విమాన దళం మధ్య సమన్వయం కుదిర్చి ఏకతాటి మీద నడిపిస్తాడన్న మాట. 1999 కార్గిల్ యుద్ధం సందర్భంగా ప్రభుత్వం ఒక హై లెవెల్ కమిటీని నియమించింది. భారత రక్షణ వ్యవస్థ లో […]

రక్షణ వ్యవస్థ లో కీలక పదవి ప్రకటన
X

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఓ ముఖ్యమైన ప్రకటన చేశారు. ఎర్రకోట మీద నుంచి మాట్లాడుతూ మన త్రివిధ దళాలకు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సి డి ఎస్)ని నియమించనున్నట్లు చెప్పారు.

చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్…. సైన్యం, నౌకాదళం, విమాన దళం మధ్య సమన్వయం కుదిర్చి ఏకతాటి మీద నడిపిస్తాడన్న మాట.
1999 కార్గిల్ యుద్ధం సందర్భంగా ప్రభుత్వం ఒక హై లెవెల్ కమిటీని నియమించింది. భారత రక్షణ వ్యవస్థ లో ఉన్న లోపాలను, గ్యాపు లను గుర్తించాలని దీనిని కోరింది. ఈ కమిటీ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ని నియమించాలని సిఫార్సు చేసింది.

అట్లాగే రక్షణ వ్యవస్థను విశ్లేషించడానికి ఏర్పాటుచేసిన మంత్రుల బృందం కూడా చీఫ్ ఆఫ్ స్టాఫ్ ని ఏర్పాటు చేయాలని కోరింది.
2012లో ఏర్పాటుచేసిన నరేష్ చంద్ర టాస్క్ ఫోర్స్ కూడా చీఫ్ ఆఫ్ స్టాఫ్ కమిటీ కి ఒక చైర్మన్ పోస్టు ను సృష్టించమని కోరింది.

ప్రస్తుతం సైన్యం, నౌకాదళం, విమాన దళం అధిపతులలో ఎవరు సీనియర్ మోస్ట్ అయితే వారిని త్రివిధ దళాల కమిటీకి చైర్మన్ గా నియమిస్తున్నారు.

ప్రధాన మంత్రి చెప్పినట్లు ఇప్పుడు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ని ఏ ప్రాతిపదికన నియమిస్తారో తెలియదు. దేశం లోను, సరిహద్దుల్లోనూ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో సిడిఎస్ ని నియమించడం ప్రాధాన్యత సంతరించు కుంది.

రక్షణ దళాలు అన్నింటిపై ఒకరికే పెత్తనం ఇస్తే సైనిక నియంత్రుత్వం వస్తుందనే భయం తో మన రాజ్యాంగ నిర్మాతలు అధికారాన్ని వికేంద్రీకరిస్తూ… మూడు భాగాలుగా విభజించి ముగ్గురు అధిపతులను నియమించారు. ఈ ముగ్గురూ ఎన్నికైన ప్రజా ప్రభుత్వం కనుసన్నల్లో ఉండేలా నిబంధనలు పెట్టారు.

మనతో పాటు స్వతంత్ర దేశం గా మనుగడ ప్రారంభించిన పాకిస్తాన్ లో సైన్యానికి ఎక్కువ అధికారాలు ఉన్నందు వల్ల అనేక సార్లు అక్కడ ప్రజాస్వామ్యం కూలిపోయి మిలిటరీ పాలన వచ్చిన సంగతి తెలిసిందే.

First Published:  15 Aug 2019 5:34 AM GMT
Next Story