Telugu Global
National

త్వరలోనే వన్‌ నేషన్‌-వన్ ఎలక్షన్

ప్రజల ఆకాంక్ష మేరకే ఆర్టికల్ 370ని రద్దు చేశామని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై జెండా ఎగురవేసిన ప్రధాని మోడీ అనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఆర్టికల్‌ 370 రద్దుతో కశ్మీర్ ప్రజలకు పూర్తి స్వేచ్చ లభించిందన్నారు. గత ప్రభుత్వాలు ఆర్టికల్ 370పై ఒక నిర్ణయానికి రాలేకపోయాయన్నారు. ప్రస్తుతం కశ్మీర్‌లోని అన్ని వర్గాల ప్రజలకు సమాన అవకాశాలు ఉంటాయన్నారు. ఆర్టికల్ 370, 35 ఏ రద్దు ద్వారా కశ్మీర్ ప్రజలకు బహుమతి ఇచ్చామన్నారు. […]

త్వరలోనే వన్‌ నేషన్‌-వన్ ఎలక్షన్
X

ప్రజల ఆకాంక్ష మేరకే ఆర్టికల్ 370ని రద్దు చేశామని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై జెండా ఎగురవేసిన ప్రధాని మోడీ అనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.

ఆర్టికల్‌ 370 రద్దుతో కశ్మీర్ ప్రజలకు పూర్తి స్వేచ్చ లభించిందన్నారు. గత ప్రభుత్వాలు ఆర్టికల్ 370పై ఒక నిర్ణయానికి రాలేకపోయాయన్నారు. ప్రస్తుతం కశ్మీర్‌లోని అన్ని వర్గాల ప్రజలకు సమాన అవకాశాలు ఉంటాయన్నారు. ఆర్టికల్ 370, 35 ఏ రద్దు ద్వారా కశ్మీర్ ప్రజలకు బహుమతి ఇచ్చామన్నారు. కశ్మీర్‌, లడఖ్‌ లలో శాంతి స్థాపనే తమ లక్ష్యమన్నారు మోడీ. ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న పోరాటానికి ప్రపంచ దేశాల మద్దతు ఉందన్నారు.

ఆర్టికల్ 370 రద్దు ద్వారా సర్దార్ వల్లభాయ్ పటేల్ కల సాకారం చేశామన్నారు. ఆర్టికల్ 370కి అంత ప్రాధాన్యతే ఉంటే దాన్ని ఎందుకు తాత్కాలికంగా రాజ్యాంగంలో చేర్చారని ప్రధాని ప్రశ్నించారు. ఒకే దేశం-ఒకే రాజ్యాంగం ఉండాలని…. అందుకే ఇలా చేశామన్నారు. వన్ నేషన్- వన్ ఎలక్షన్ అంశంపైనా చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. వన్‌ నేషన్- వన్ ఎలక్షన్‌ను కూడా అమలు చేస్తామన్నారు. త్రిపుల్‌ తలాక్‌ రద్దుతో ముస్లిం మహిళల జీవితాల్లో సాధికారిత తెచ్చామన్నారు.

దేశ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామన్నారు. తన భవిష్యత్తు గురించి తనకు దిగులు లేదని… దేశ భవిష్యత్తే తనకు ముఖ్యమని మోడీ వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వాలు దేశంలోని పేదల గురించి పట్టించుకోలేదన్నారు. దేశం పట్ల విపక్షాలకు చిత్తశుద్ది లేదన్నారు. దేశంలో నీటి కొరత తీర్చేందుకు జల్‌ జీవన్‌ మిషన్‌కు 3.5 లక్షల కోట్లను కేటాయిస్తున్నామన్నారు.

పది వారాల్లోనే ఎన్నో నిర్ణయాలు తీసుకున్నామని… ఐదేళ్లలో పూర్తి నవభారతాన్ని నిర్మిస్తామన్నారు. రాజకీయ అవసరాల ఆధారంగా నిర్ణయాలు ఉండకూడదన్నారు. జనాభా విస్పోటనం ఆందోళన కలిగించే అంశమని… జనాభా నియంత్రణ అవసరాన్ని జనంలోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. పెరుగుతున్న జనాభా దేశాన్ని కష్టాల్లోకి నెట్టుతోందన్నారు. ప్రజల ఆలోచన విధానం మారినప్పుడే దేశం మారుతుందని అభిప్రాయపడ్డారు.

తమ ప్రభుత్వం నుంచి ప్రజలు ఎంతో అభివృద్ధిని ఆకాంక్షిస్తున్నారని… రాబోయే ఐదేళ్లలో 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థకు చేరుకోవడం ఏమంతా కష్టం కాదని ధీమా వ్యక్తం చేశారు. ప్రతి జిల్లా ఒక ఎగుమతి కేంద్రంగా మారాలన్నారు ప్రధాని నరేంద్ర మోడీ.

First Published:  14 Aug 2019 10:44 PM GMT
Next Story