Telugu Global
Cinema & Entertainment

రాజమౌళి స్టేట్మెంట్ పై క్లారిటీ ఇచ్చిన ప్రభాస్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘సాహో’ సినిమా తెలుగులోనే కాక హిందీలో కూడా విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విడుదలకు ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో ప్రభాస్, చిత్ర బృందం సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో పలు ఇంటర్వ్యూలలో మాట్లాడుతున్న ప్రభాస్ ఈ మధ్యనే రాజమౌళి చేసిన ఒక స్టేట్మెంట్ గురించి క్లారిటీ ఇచ్చారు. గతంలో కాఫీ విత్ కరణ్ షోలో మాట్లాడుతూ రాజమౌళి […]

రాజమౌళి స్టేట్మెంట్ పై క్లారిటీ ఇచ్చిన ప్రభాస్
X

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘సాహో’ సినిమా తెలుగులోనే కాక హిందీలో కూడా విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో విడుదలకు ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో ప్రభాస్, చిత్ర బృందం సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో పలు ఇంటర్వ్యూలలో మాట్లాడుతున్న ప్రభాస్ ఈ మధ్యనే రాజమౌళి చేసిన ఒక స్టేట్మెంట్ గురించి క్లారిటీ ఇచ్చారు. గతంలో కాఫీ విత్ కరణ్ షోలో మాట్లాడుతూ రాజమౌళి టాలీవుడ్ లో స్టార్ హీరోలందరికీ అభిమానులకు ఏం కావాలో బాగా తెలుసు అని చెప్పారు.

మరి బాలీవుడ్ స్టార్ల కి అభిమానులకు ఏం కావాలో తెలియదా అంటూ కొందరు ప్రశ్నించారు. అదే ప్రశ్న ఇప్పుడు ప్రభాస్ కి కూడా ఒక ఇంటర్వ్యూలో ఎదురవగా, ప్రభాస్ డిప్లోమేటిక్ ఆన్సర్ ఇచ్చాడు.

టాలీవుడ్ లో స్టార్ హీరో అయిన ప్రభాస్ బాలీవుడ్ లో కూడా హీరోగా మారిపోయాడు. అందుకే ఆ స్టేట్మెంట్ తప్పని… ఒకవేళ వాళ్ళు నిజంగా సూపర్ స్టార్స్ అయితే వాళ్ళు ఎందుకు కన్ఫ్యూజన్ లో ఉంటారు అని అన్నాడు ప్రభాస్. శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటించిన ‘సాహో’ సినిమా ఈ నెల 30వ తేదీన విడుదలకు సిద్దమవుతోంది.

First Published:  15 Aug 2019 12:37 AM GMT
Next Story