Telugu Global
NEWS

క్రికెట్ చరిత్రలో సరికొత్త ప్రయోగం

లెదర్ బాల్ స్థానంలో రబ్బర్ బాల్  వేగన్ బాల్ తో బ్రిటీష్ క్లబ్ సంచలనం దశాబ్దాల చరిత్ర కలిగిన క్రికెట్లో ఓ సరికొత్త ఆలోచనకు…క్రికెట్ పుట్టినిల్లు ఇంగ్లండ్ లో తెరలేచింది. క్రికెట్ అనగానే కోడెదూడల చర్మంతో తయారు చేసిన సాంప్రదాయ లెదర్ బాల్స్ తో ఆడుతూ వస్తున్నారు. క్రికెట్లో ఫార్మాట్లు మారినట్లే బంతుల రంగులు సైతం మారుతూ వచ్చాయి. ఐదురోజుల టెస్ట్ క్రికెట్లో జంతు చర్మానికి ఇటుక రంగుజోడించి తయారు చేసిన బంతులను ఉపయోగిస్తూ ఉంటే…ఫ్లడ్ లైట్ల వెలుగులో […]

క్రికెట్ చరిత్రలో సరికొత్త ప్రయోగం
X
  • లెదర్ బాల్ స్థానంలో రబ్బర్ బాల్
  • వేగన్ బాల్ తో బ్రిటీష్ క్లబ్ సంచలనం

దశాబ్దాల చరిత్ర కలిగిన క్రికెట్లో ఓ సరికొత్త ఆలోచనకు…క్రికెట్ పుట్టినిల్లు ఇంగ్లండ్ లో తెరలేచింది. క్రికెట్ అనగానే కోడెదూడల చర్మంతో తయారు చేసిన సాంప్రదాయ లెదర్ బాల్స్ తో ఆడుతూ వస్తున్నారు.

క్రికెట్లో ఫార్మాట్లు మారినట్లే బంతుల రంగులు సైతం మారుతూ వచ్చాయి. ఐదురోజుల టెస్ట్ క్రికెట్లో జంతు చర్మానికి ఇటుక రంగుజోడించి తయారు చేసిన బంతులను ఉపయోగిస్తూ ఉంటే…ఫ్లడ్ లైట్ల వెలుగులో నిర్వహిస్తున్న డే- నైట్ క్రికెట్ టెస్ట్ మ్యాచ్ ల్లో మాత్రం.. పింక్ కలర్ బాల్స్ ను ఉపయోగిస్తున్నారు.

ఇక..50 ఓవర్ల వన్డే క్రికెట్, ధూమ్ ధామ్ టీ-20 ఫార్మాట్లలో వాడుతున్న తెలుపురంగు బాల్స్ ను సైతం కోడెదూడల చర్మంతోనే
తయారు చేస్తూ వస్తున్నారు.

అయితే…జంతు ఉత్పత్తులను నివారించడానికి జంతు ప్రేమికులు ప్రారంభించిన వేగన్ ఉద్యమానికి మద్దతుగా నిలవాలని… ఇంగ్లండ్ లోని ఇయర్లే క్రికెట్ క్లబ్ చైర్మన్ గ్యారీ షాక్ లేడీ గట్టిగా నిర్ణయించుకోడమే కాదు… ఆచరణను ప్రారంభించారు.

తమ క్లబ్ జట్టు క్రికెట్ మ్యాచ్ లు ఆడే సమయంలో క్రికెటర్లకు ఇచ్చే ఆహారం లో జంతు ఉత్పత్తులు లేకుండా ఇప్పటికే వేగన్ ఆహారాన్ని సమకూర్చుతూ వస్తోంది.

వేగన్ క్రికెట్ బాల్స్ తో మ్యాచ్ లు..

ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలలో ఏటా నిర్వహించే వేలాది క్రికెట్ మ్యాచ్ ల్లో ఉపయోగించే లక్షలాది క్రికెట్ బంతుల తయారీ కోసం.. కోడెదూడల చర్మాన్ని ఉపయోగిస్తున్నారు.

అయితే .. ఈ పరిస్థితిని నివారించడానికి వీలుగా ఇయర్లే క్రికెట్ క్లబ్… వేగన్ క్రికెట్ బాల్స్ ను ప్రవేశపెట్టింది. జంతు చర్మంతో తయారు చేసిన లెదర్ బాల్ స్థానంలో రబ్బరుతో తయారు చేసిన బాల్స్ ను మ్యాచ్ ల కోసం ఉపయోగిస్తోంది.

రానున్న కాలంలో వేగన్ బాల్స్ తోనే క్రికెట్ మ్యాచ్ లు జరగాలని గట్టిగా కోరుకొంటోంది. మరి…ఈ ప్రయోగాన్ని అంతర్జాతీయ క్రికెట్ మండలి కమ్ ఐసీసీ ఏ మేరకు స్వాగతిస్తోందో మరి.

First Published:  14 Aug 2019 7:50 PM GMT
Next Story