ఫలక్ నుమాదాస్…. ఇప్పుడు ‘పాగల్’ అవుతున్నాడు…

ఫలక్ నుమాదాస్ అనే సినిమా తో మంచి హిట్ కొట్టిన హీరో విశ్వక్సేన్. అలాగే హుషారు అనే సినిమా తో విజయం సాధించిన నిర్మాత బెక్కెం వేణు గోపాల్. వీరు ఇరువురు కలిసి ఇప్పుడు ఒక ఆసక్తికరమైన సినిమా తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

ఈ ఇద్దరు కలిసి నటిస్తున్న చిత్రం ‘పాగల్’. ఈ సినిమా కి సంబందించిన అధికారిక ప్రకటన విడుదల అయింది. నరేష్ రెడ్డి కుప్పిలి అనే నూతన దర్శకుడు ఈ సినిమా కి దర్శకత్వం వహించనున్నాడు.

ఈ విషయమై చిత్ర యూనిట్ ఎంతో సంతోషం గా ఉంది. ఈ సినిమా షూటింగ్ వచ్చే నెల లో మొదలు కానుంది. అలాగే సినిమా వచ్చే ఏడాది ప్రథమార్థం లో థియేటర్ల లో కి రానుంది. లక్కీ మీడియా ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మాణ సంస్థ ఈ సినిమా ని నిర్మించనుంది. ఈ చిత్రం లో మిగిలిన నటీ నటుల, మరియు టెక్నీషియన్ల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ఈ సినిమా గురించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయి. ఫలక్ నుమాదాస్ తర్వాత ఏ దర్శకుడి తో పని చేస్తాడా అని వేచి చూసిన విశ్వక్ ఒక కొత్త దర్శకుడితో పనిచేయబోతున్నాడు.