Telugu Global
NEWS

నా దగ్గరకు రావొద్దు... పైరవీకారులకు డిప్యూటీ సీఎం హెచ్చరిక

నేతలకు లంచాలిస్తే ఏ పనైనా జరిగిపోతుందన్న అభిప్రాయం ఇంతకాలం బలంగా ఉండేది. అయితే కొత్త ప్రభుత్వంలో కొందరు మంత్రుల తీరు చూసి పైరవీ కారులు కంగుతింటున్నారు. ఆ మధ్య తనను విజయవాడలో సబ్ రిజిస్ట్రార్‌గా నియమిస్తే కోటి రూపాయలు ఇస్తానంటూ ఒకరు ఏకంగా రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాస్ చంద్రబోస్ వద్దకు వెళ్లారు. ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడంతో సదరు వ్యక్తి తోక ముడిచాడు. ఆ తర్వాత రెవెన్యూ శాఖలో బదిలీలకు మరింత కఠిన నిబంధనలను […]

నా దగ్గరకు రావొద్దు... పైరవీకారులకు డిప్యూటీ సీఎం హెచ్చరిక
X

నేతలకు లంచాలిస్తే ఏ పనైనా జరిగిపోతుందన్న అభిప్రాయం ఇంతకాలం బలంగా ఉండేది. అయితే కొత్త ప్రభుత్వంలో కొందరు మంత్రుల తీరు చూసి పైరవీ కారులు కంగుతింటున్నారు. ఆ మధ్య తనను విజయవాడలో సబ్ రిజిస్ట్రార్‌గా నియమిస్తే కోటి రూపాయలు ఇస్తానంటూ ఒకరు ఏకంగా రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాస్ చంద్రబోస్ వద్దకు వెళ్లారు. ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడంతో సదరు వ్యక్తి తోక ముడిచాడు. ఆ తర్వాత రెవెన్యూ శాఖలో బదిలీలకు మరింత కఠిన నిబంధనలను అమలు చేశారు. ఇప్పుడు మరో డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కూడా ఇదే తరహాలో ముందుకెళ్తున్నారు.

ఉద్యోగుల బదిలీలను నెల క్రితం ప్రభుత్వం పూర్తి చేసింది. అయినా సరే కొందరు ఉద్యోగులు ఆళ్ల నాని ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. ఐదేళ్లకు పైగా ఒకేచోట పనిచేస్తున్న వారిని ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ బదిలీలపై మెజారిటీ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేయగా… కొందరికి ఇది జీర్ణం కాలేదు. తిరిగి పాత స్థానాల్లోనే పాగా వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం కొందరు ఆళ్లనాని వద్దకు వెళ్లారు. అందుకు మంత్రి వారి ముఖం మీదే అది జరిగే పనికాదని తేల్చేశారు. ఉద్యోగాలకు వెళ్లకుండా తన చుట్టూ తిరిగి మరోసారి టైం వేస్ట్ చేసుకోవద్దని సూటిగా చెప్పేశారు.

బదిలీల పక్రియ ముగిసిందని… ప్రభుత్వం నిబంధనల ప్రకారం ఐదేళ్లు ఒకేచోట సర్వీస్ పూర్తి చేసుకున్న వారు బదిలీ కావాల్సిందేనని… జరిగిన బదిలీలను రివర్స్‌ చేసేందుకు తాను సహకరించబోనని స్పష్టం చేశారు.

First Published:  15 Aug 2019 11:41 PM GMT
Next Story