Telugu Global
NEWS

కమలానికి మహిళా అధ్యక్షురాళ్లు

రెండు రాష్ట్రాలకు ఇద్దరు మహిళా నాయకురాళ్లను అధ్యక్షులుగా నియమించాలని భారతీయ జనతా పార్టీ అధిష్టానం భావిస్తోందా..? ఇప్నుడున్న అధ్యక్షులను జాతీయ కార్యవర్గంలోకి తీసుకుని వారి స్ధానంలో ఇద్దరు మహిళలకు పార్టీ పగ్గాలు ఇవ్వాలని కమలనాథులు నిర్ణయించారా..? అంటే అవుననే అంటున్నారు ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో భారతీయ జనతా పార్టీని పటిష్ట పరచడంలో భాగంగా మహిళా అధ్యక్షరాళ్లను నియమించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా రెండు రాష్ట్రాలలో బలమైన సామాజిక వర్గాల […]

కమలానికి మహిళా అధ్యక్షురాళ్లు
X

రెండు రాష్ట్రాలకు ఇద్దరు మహిళా నాయకురాళ్లను అధ్యక్షులుగా నియమించాలని భారతీయ జనతా పార్టీ అధిష్టానం భావిస్తోందా..? ఇప్నుడున్న అధ్యక్షులను జాతీయ కార్యవర్గంలోకి తీసుకుని వారి స్ధానంలో ఇద్దరు మహిళలకు పార్టీ పగ్గాలు ఇవ్వాలని కమలనాథులు నిర్ణయించారా..? అంటే అవుననే అంటున్నారు ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో భారతీయ జనతా పార్టీని పటిష్ట పరచడంలో భాగంగా మహిళా అధ్యక్షరాళ్లను నియమించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా రెండు రాష్ట్రాలలో బలమైన సామాజిక వర్గాల నేపథ్యంలో కూడా మహిళా అధ్యక్షరాళ్లను నియమిస్తే మంచిదని అంటున్నారు. ఆంధ్ర్రప్రదేశ్ లో పార్టీ అద్యక్ష పదవిని దగ్గుబాటి పురంధ్రీశ్వరికి ఇవ్వాలన్నది పార్టీ అధిష్టానం యోచనగా చెబుతున్నారు.

పురంధ్రీశ్వరి కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు కావడం ఆమె ఎంపికకు సానుకూల అంశంగా చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో రెడ్డి సామాజిక వర్గం ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డికి మద్దతుగా ఉంది. ఏపీలో రెడ్డి సామాజిక వర్గానికి రాజకీయ ప్రత్యర్దులుగా భావించే కమ్మ సామాజిక వర్గం ఇన్నాళ్లు తెలుగుదేశం పార్టీతో ఉంది. గత ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకులు బీజేపీలో చేరుతున్నారు.

ఏపీలో టీడీపీకి ప్రత్యామ్నాయం తామేనని బీజేపీ నాయకులు అనుకుంటున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో పురంధరీశ్వరికి అధ్యక్ష పదవి ఇవ్వాలని ప్రతిపాదనలు వచ్చినట్లుగా సమాచారం. దీని వల్ల ఒకవైపు మహిళలను, మరోవైపు కమ్మ సామాజిక వర్గాన్నితమవైపు తిప్పుకోవచ్చునని బిజేపీ భావిస్తోంది.

తెలంగాణలో బిజేపీ అధ్యక్షురాలిగా డి.కె. అరుణను నియమించే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఇప్పటికే డి.కె. అరుణ అధ్యక్ష పదవి కోసం ప్రయత్నాలు ప్రారంభించారు.

తెలంగాణలో అధికారంలో ఉన్న కేసీఆర్ ఇక్కడి రెడ్డి సామాజిక వర్గాన్నిపట్టించుకోవడం లేదనే ప్రచారం జరుగుతోంది. ఈ పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకోవాలని బీజేపీ నాయకుల ఎత్తుగడగా చెబుతున్నారు. డీ.కే.అరుణను అధ్యక్షురాలిని చేస్తే రెడ్డి సామాజిక వర్గాన్నితమ వైపు తిప్పుకోవడం సులభమవుతుందని కమలనాథుల రాజకీయ వ్యూహంగా పరిశీలకులు అంటున్నారు. ఈ నియామకంతో తెలంగాణలో మహిళలను బీజేపీలోకి ఆకర్షించే అవకాశాలున్నాయని కమలనాథుల భావన.

First Published:  16 Aug 2019 12:59 AM GMT
Next Story