‘సై రా’ పై…. హైప్ వద్దంటున్న దర్శకుడు

కేవలం మెగా అభిమానులు మాత్రమే కాకుండా టాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మధ్యనే చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా సినిమాకి సంబంధించిన మేకింగ్ వీడియోని విడుదల చేశారు దర్శక నిర్మాతలు.

భారీ అంచనాల మధ్య ఈ ప్రతిష్టాత్మక చిత్రం అక్టోబర్ 2న విడుదల కాబోతోంది. ఒకవైపు చిత్రబృందం సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉండగా… మరొక వైపు దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ సినిమా హైప్ ని కొంచెం తగ్గించడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

కొన్ని కొన్ని సార్లు భారీ అంచనాలు కూడా…. కొన్ని సినిమాలు ఫ్లాప్ అవ్వడానికి కి కారణమయ్యాయి.

ఈ నేపథ్యంలోనే కొందరు ‘సై రా’ సినిమాని బాహుబలి సినిమాతో పొలుస్తున్నారని, కానీ ‘సై రా’ ఒక బయోపిక్ కాబట్టి బాహుబలిలో చేసినది ఇందులో చేయలేమని…. ఎందుకంటే రెండు వేరే వేరే జోనర్స్ కి సంబంధించిన సినిమాలు అని చెబుతున్నారు సురేందర్ రెడ్డి.

బాహుబలి ఒక విజువల్ వండర్ గా ఉండే వార్ అని, అలా కాకుండా సైరా సినిమా ఒక బయోపిక్ లా చూడమని సురేందర్ రెడ్డి అభిమానులకు చెబుతున్నారట.

ఏదేమైనా మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటే ఆ మాత్రం అంచనాలు కచ్చితంగా ఉంటాయి. రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, నయనతార, తమన్నా, విజయ్ సేతుపతి, సుదీప్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.