Telugu Global
National

అక్టోబర్ 29 నుంచి ఢిల్లీ లో మహిళలకు ఉచిత బస్ ప్రయాణ సౌకర్యం

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మాట్లాడుతూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. అక్టోబర్ 29 నుంచి ఢిల్లీ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ బస్సుల్లోనూ, క్లస్టర్ బస్సుల్లోనూ మహిళలు ఉచితంగా ప్రయాణం చేయవచ్చని ప్రకటించారు. ‘భాయ్ డూజ్’ పథకం ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణ సేవలు అందించనున్నామని చెప్పారు. “రక్షాబంధన్ సందర్భంగా సోదరీమణులకు ఓ గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటున్నా. ఢిల్లీ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్, అట్లాగే క్లస్టర్ బస్సుల్లో అక్టోబర్ 29 నుంచి మీరు ఉచిత ప్రయాణం చేయవచ్చు. ట్రాన్స్ […]

అక్టోబర్ 29 నుంచి ఢిల్లీ లో మహిళలకు ఉచిత బస్ ప్రయాణ సౌకర్యం
X

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మాట్లాడుతూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. అక్టోబర్ 29 నుంచి ఢిల్లీ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ బస్సుల్లోనూ, క్లస్టర్ బస్సుల్లోనూ మహిళలు ఉచితంగా ప్రయాణం చేయవచ్చని ప్రకటించారు. ‘భాయ్ డూజ్’ పథకం ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణ సేవలు అందించనున్నామని చెప్పారు.

“రక్షాబంధన్ సందర్భంగా సోదరీమణులకు ఓ గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటున్నా. ఢిల్లీ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్, అట్లాగే క్లస్టర్ బస్సుల్లో అక్టోబర్ 29 నుంచి మీరు ఉచిత ప్రయాణం చేయవచ్చు. ట్రాన్స్ పోర్ట్ బస్సుల్లో ప్రయాణించటం వల్ల భద్రత చేకూరుతుంది” అని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అన్నారు.

2 నెలల క్రితం ఢిల్లీ ప్రభుత్వం మెట్రో రైల్ లోనూ, బస్సుల్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని ప్లాన్ చేసింది. ఇందు వలన ప్రజల్లో పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ని ఉపయోగించే అలవాటు పెరుగుతుందని, అట్లాగే మహిళలకు రక్షణ కూడా ఉంటుందని భావిస్తూ ఈ ప్లాన్ ని ప్రకటించారు.

ఉచిత ప్రయాణ సేవకు 700 కోట్ల రూపాయలు ఖర్చు కావచ్చని, ఆ ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని ఆయన అన్నారు. అయితే డబ్బు పెట్టి టిక్కెట్టు కొన గలిగినవారు కొనుక్కోవాలని ఆయన సూచించారు.

First Published:  15 Aug 2019 11:54 PM GMT
Next Story