Telugu Global
Cinema & Entertainment

మొదటి పాటతో.... 'గ్యాంగ్ లీడర్'

నాచురల్ స్టార్ నాని హీరోగా మనం ఫేమ్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న సినిమా ‘గ్యాంగ్ లీడర్’. రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది. లక్ష్మీ మరియు శరణ్య పొంవణ్ణన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా టీజర్ కు ప్రేక్షకుల నుంచి మంచి మార్కులే పడ్డాయి. పెన్సిల్ పార్థసారధి పాత్రలో నాని ఈ సినిమాలో ఈ సినిమాతో కచ్చితంగా […]

మొదటి పాటతో.... గ్యాంగ్ లీడర్
X

నాచురల్ స్టార్ నాని హీరోగా మనం ఫేమ్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న సినిమా ‘గ్యాంగ్ లీడర్’.

రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది. లక్ష్మీ మరియు శరణ్య పొంవణ్ణన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా టీజర్ కు ప్రేక్షకుల నుంచి మంచి మార్కులే పడ్డాయి.

పెన్సిల్ పార్థసారధి పాత్రలో నాని ఈ సినిమాలో ఈ సినిమాతో కచ్చితంగా ప్రేక్షకులను అలరిస్తాడని సమాచారం. తాజాగా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ సినిమా నుంచి ‘హొయ్ న హొయ్ న’ అనే మొదటి పాటను ఇవాళ విడుదల చేశారు దర్శక నిర్మాతలు.

అనిరుద్ రవిచందర్ అందించిన సంగీతం ఈ సినిమాకి వెన్నెముకగా మారబోతోంది అని… ఈ పాట వింటుంటేనే తెలుస్తోంది. అనంత శ్రీరామ్ రాసిన లిరిక్స్ మరియు గొంతు ఈ పాటని మరింత ఆసక్తికరంగా మార్చాయి.

సితార ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగ వంశీ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. భారీ అంచనాల మధ్య ఈ సినిమా సెప్టెంబర్ 13న విడుదలకు సిద్ధమవుతోంది. మరి ఈ సినిమాతో నాని ఎంత వరకు హిట్ అందుకుంటాడో తెలియాలంటే వేచి చూడాల్సి ఉంది.

First Published:  16 Aug 2019 1:23 AM GMT
Next Story