Telugu Global
NEWS

నేటినుంచే భారత భారత చీఫ్ కోచ్ ఇంటర్వ్యూలు

ముగ్గురు విదేశీ కోచ్ లతో రవి శాస్త్రి పోటీ స్కైప్ ద్వారా ఎంపిక సంఘం ముందు రవిశాస్త్రి భారత క్రికెట్ బోర్డు..చీఫ్ కోచ్ ఎంపిక ముంబైలో ఈ రోజు ప్రారంభంకానుంది. కపిల్ దేవ్ నేతృత్వంలో అంశుమాన్ గయక్వాడ్, శాంతా రంగస్వామిలతో కూడిన ముగ్గురు సభ్యుల క్రికెట్ సలహామండలి ఈ ఎంపిక కార్యక్రమాన్ని నిర్వహించనుంది. నేడు, రేపు కొనసాగనున్న ఈ ఇంటర్వ్యూ ల్లో ప్రస్తుతకోచ్ రవి శాస్త్రితో పాటు మరో ఐదుగురు పాల్గోనున్నారు. మొత్తం ఆరుగులు అభ్యర్థుల తుదిజాబితాలో ముగ్గురు విదేశీ […]

నేటినుంచే భారత భారత చీఫ్ కోచ్ ఇంటర్వ్యూలు
X
  • ముగ్గురు విదేశీ కోచ్ లతో రవి శాస్త్రి పోటీ
  • స్కైప్ ద్వారా ఎంపిక సంఘం ముందు రవిశాస్త్రి

భారత క్రికెట్ బోర్డు..చీఫ్ కోచ్ ఎంపిక ముంబైలో ఈ రోజు ప్రారంభంకానుంది. కపిల్ దేవ్ నేతృత్వంలో అంశుమాన్ గయక్వాడ్, శాంతా రంగస్వామిలతో కూడిన ముగ్గురు సభ్యుల క్రికెట్ సలహామండలి ఈ ఎంపిక కార్యక్రమాన్ని నిర్వహించనుంది.

నేడు, రేపు కొనసాగనున్న ఈ ఇంటర్వ్యూ ల్లో ప్రస్తుతకోచ్ రవి శాస్త్రితో పాటు మరో ఐదుగురు పాల్గోనున్నారు. మొత్తం ఆరుగులు అభ్యర్థుల తుదిజాబితాలో ముగ్గురు విదేశీ కోచ్ లు సైతం ఉండటం విశేషం.

హాట్ ఫేవరెట్ గా రవిశాస్త్రి

గత రెండేళ్లుగా భారతజట్టుకు ప్రధాన శిక్షకుడిగా సేవలు అందించిన రవి శాస్త్రి పదవీ కాలం గతనెలలోనే ముగిసినా…కరీబియన్ టూర్ కోసం 45 రోజులపాటు కాంట్రాక్టు పొడిగించినా… సరికొత్త చీఫ్ కోచ్ పదవి కోసం మరోసారి పోటీకి దిగుతున్నారు.

ప్రస్తుతం కరీబియన్ ద్వీపాల టూర్ లో ఉన్న రవిశాస్త్రి స్కైప్ ద్వారా… బీసీసీఐ క్రికెట్ సలహామండలి ముందు హాజరు కానున్నారు.

భారత మాజీ కెప్టెన్ రవిశాస్త్రికి 80 టెస్టులు, 150 వన్డే మ్యాచ్ లు ఆడిన అనుభవం ఉంది.

కీలక విజయాల రవిశాస్త్రి…

2017 సీజన్లో భారతజట్టు చీఫ్ కోచ్ గా ఏడాదికి 7 కోట్ల 50 లక్షల రూపాయల కాంట్రాక్టు పై బాధ్యతలు చేపట్టిన రవిశాస్త్రి..కెప్టెన్ కొహ్లీతో కలసి సమర్థవంతంగా సేవలు అందించాడు. అయితే…సౌతాఫ్రికా గడ్డపై టెస్ట్ సిరీస్ సాధించడంలోనూ, ప్రపంచకప్ టైటిల్ సాధించడంలోనూ విఫలమై విమర్శకులకు అవకాశం ఇచ్చాడు.

రెండుసార్లు ఆసియాకప్ విజేతగా నిలవడం మాత్రమే కాదు.. ఆస్ట్ర్రేలియాను ఆస్ట్ర్లేలియా గడ్డపై ఓడించడం ద్వారా..తొలిసారిగా భారతజట్టు టెస్ట్ సిరీస్ నెగ్గడం ద్వారా చరిత్ర సృష్టించింది.

శాస్త్రి కోచ్ గా 21 టెస్టులు ఆడిన భారత్ 13 విజయాలు, 36 టీ-20ల్లో 25 విజయాలు, 60 వన్డేల్లో 43 విజయాలు నమోదు చేసింది.

రవిశాస్త్రి చీఫ్ కోచ్ గా భారతజట్టు 70 శాతం విజయాలు నమోదు చేసింది.

రేసులో రాజ్ పుట్, రాబిన్ సింగ్…

ఆగస్టు 16 నుంచి జరిగే ఇంటర్వ్యూల కోసం తుదిజాబితాలో నిలిచిన మొత్తం ఆరుగురు అభ్యర్థుల్లో భారత మాజీ ఫీల్డింగ్ కోచ్ రాబిన్ సింగ్, లాల్ చంద్ రాజ్ పుట్ తో పాటు…టామ్ మూడీ, మైక్ హెస్సెన్, ఫిల్ సిమ్మన్స్ ఉన్నారు.

భారత క్రికెట్ ప్రమాణాలు పెంచడం కోసం తమ వద్ద ఉన్న ప్రణాళికలను ఈ ఆరుగురు అభ్యర్థులు..ఎంపిక సంఘం ముందు
వివరించాల్సి ఉంది.

భారతజట్టు చీఫ్ కోచ్ పదవితో పాటు సహాయక సిబ్బంది పోస్టుల కోసం మొత్తం 2వేల దరఖాస్తులు బీసీసీఐకి చేరాయి.
ముగ్గురు సభ్యుల కమిటీదే తుది నిర్ణయం.. భారత క్రికెట్ చీఫ్ కోచ్ ఎంపిక కోసం…కపిల్ దేవ్ నేతృత్వంలో అంశుమాన్ గయక్వాడ్, శాంతా రంగస్వామి సభ్యులుగా ముగ్గురు సభ్యుల కమిటీని భారత క్రికెట్ పాలకమండలి నియమించింది.

చీఫ్ కోచ్ గా ఎంపికైన అభ్యర్థికి ఏడాదికి 7 కోట్ల 50 లక్షల రూపాయల వేతనంతో పాటు రెండేళ్ల కాంట్రాక్టు ఇవ్వనున్నారు.

ఆగస్టు 16, 17 తేదీలలో చీఫ్ కోచ్ ఇంటర్వ్యూల కార్యక్రమానికి తెరపడనుంది. మిగిలిన సహాయసిబ్బందికి ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ ఎంపిక నిర్వహించనుంది.

First Published:  16 Aug 2019 12:00 AM GMT
Next Story