Telugu Global
Cinema & Entertainment

సుకుమార్, బన్నీ సినిమాలో..... నిహారిక?

మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక కొణిదల ‘ఒక మనసు’ సినిమా తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అయితే మొదటి సినిమాతోనే డిజాస్టర్ అందుకున్న ఈమె వరుసగా ‘హ్యాపీ వెడ్డింగ్’, ‘సూర్యకాంతం’ సినిమాలతో కూడా  ఫెయిల్యూర్స్ నే  చవిచూసింది. ఇక నిహారిక కొణిదెల సినిమాలకి గుడ్ బాయ్ చెప్పేస్తుందని అందరూ అనుకుంటున్న సమయంలో…. నిహారిక స్టార్ దర్శకుడి తో సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం ప్రముఖ దర్శకుడు సుకుమార్ తదుపరి సినిమాలో […]

సుకుమార్, బన్నీ సినిమాలో..... నిహారిక?
X

మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక కొణిదల ‘ఒక మనసు’ సినిమా తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అయితే మొదటి సినిమాతోనే డిజాస్టర్ అందుకున్న ఈమె వరుసగా ‘హ్యాపీ వెడ్డింగ్’, ‘సూర్యకాంతం’ సినిమాలతో కూడా ఫెయిల్యూర్స్ నే చవిచూసింది.

ఇక నిహారిక కొణిదెల సినిమాలకి గుడ్ బాయ్ చెప్పేస్తుందని అందరూ అనుకుంటున్న సమయంలో…. నిహారిక స్టార్ దర్శకుడి తో సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం ప్రముఖ దర్శకుడు సుకుమార్ తదుపరి సినిమాలో నిహారిక కొణిదెల కీలక పాత్ర పోషిస్తుందని సమాచారం.

ఈ మధ్యనే ‘రంగస్థలం’ సినిమా తో బ్లాక్ బస్టర్ అందుకున్న సుకుమార్ తన తదుపరి సినిమా అల్లు అర్జున్ తో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రష్మీక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది.

ఈ సినిమాలో నిహారిక కొణిదెల ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నట్లు గా ఇండస్ట్రీ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. అయితే దీని గురించి అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడాల్సి ఉంది. ఇది గనుక నిజమైతే సైరా సినిమాలో నిహారిక చేస్తున్న చిన్న పాత్ర ని మినహాయిస్తే…. ఒక మెగా హీరోతో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఇదే మొదటిసారి అవుతుంది.

మరోవైపు సినిమాలకు కొంచెం దూరంగా ఉంటున్న నిహారిక కొణిదెల….. ఇప్పుడు కొన్ని వెబ్ సిరీస్ లపై దృష్టి పెట్టింది.

First Published:  16 Aug 2019 4:09 AM GMT
Next Story