విందులో గవర్నర్‌, రేవంత్ సెటైర్లు

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తెలంగాణ గవర్నర్ నరసింహన్ తన రాజ్ భవన్ లో రాజకీయ, సినీ, పారిశ్రామిక, క్రీడా, జర్నలిస్ట్ ప్రముఖులకు…. ఇలా అందరికీ విందు ఇచ్చారు.

దీంతో రాజ్ భవన్ వివిధ ప్రముఖులతో సందడిగా మారింది. ఈ కార్యక్రమానికి వచ్చిన కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంపీ రేవంత్ రెడ్డి ఎదురుపడ్డప్పుడు గవర్నర్ నరసింహన్ మధ్య ఆసక్తికరణ సంభాషణ చోటుచేసుకోవడం విశేషం.

వచ్చిన అతిథులను అందరినీ పలకరించే పనిలో అటూ ఇటూ తిరుగుతూ షేక్ హ్యాండ్స్ ఇస్తున్న గవర్నర్ నరసింహన్ .. కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి వద్దకు రాగానే కొద్దిసేపు ఆగి మరీ మాట్లాడడం గమనార్హం.

రేవంత్ ను చూడగానే గవర్నర్ ‘మీరు రాలేదనుకున్నా’ అని అన్నారు. దీనికి రేవంత్ ‘మీరు కొడుతారేమోనని రాలేదు’ అని నవ్వుతూ సెటైర్ వేశారు. నేను కొడతానా.. ఒకప్పటి అసెంబ్లీ సమావేశాల్లో కుర్చీలు లాగి మీరే నన్ను కొడుదామనుకున్నారని గవర్నర్ పంచ్ వేశారు. దీనికి రేవంత్ కూడా అదే విషయాన్ని ప్రస్తావించి ‘ఆ సంఘటనను మనసులో పెట్టుకొనే ఎక్కడ కొడుతారేమోనని రాలేదని’ చమత్కరించారు. దీంతో అక్కడున్న వారంతా పెద్ద ఎత్తున నవ్వుకున్నారు.

ఇలా రేవంత్ అసెంబ్లీలో గవర్నర్ నరసింహన్ పై పాత విషయాలను గవర్నర్ ముందు తిరగదోడి రేవంత్ సెటైర్లు వేయగా.. గవర్నర్ అంతే స్పీడుగా స్పందించి నవ్వులు పూయించాడు. గవర్నర్ నరసింహన్ ను కేంద్రం బదిలీ లేదా సాగనంపే యోచనలో ఉందన్న వార్తల నేపథ్యంలో అందరినీ పిలిచి గ్రాండ్‌గా ‘ఎట్ హోమ్’ను నిర్వహించాడు. బహుశా ఇదే లాస్ట్ ఎట్ హోమ్ కావచ్చన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో సాగుతోంది.