Telugu Global
CRIME

దొంగలను తరిమిన వృద్ధ దంపతులకు స్వర్ణ పతకం

వేట కొడవళ్లతో ఇద్దరు యువ దొంగలు. ఒట్టి చేతులతో వృద్ధ దంపతులు. దోపిడి చాలా ఈజీ అనుకున్నారు ఆ దొంగలు. కానీ ఈ వృద్ధ దంపతుల ముందు కుందేలుకేం తెలుసు వడిసెల దెబ్బ అన్నట్టు చివరకు దొంగలు పారిపోయారు. ఇదీ ఇటీవల తమిళనాడులో జరిగిన సంఘటన. ఈ వార్త బాగా వైరల్ కూడా అయింది. వృద్ధ దంపతుల సాహసం తమిళనాడు సీఎంను కూడా ఆకర్షించింది. అందుకే స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా దంపతులను సీఎం పళనిస్వామి సన్మానించారు. రెండు […]

దొంగలను తరిమిన వృద్ధ దంపతులకు స్వర్ణ పతకం
X

వేట కొడవళ్లతో ఇద్దరు యువ దొంగలు. ఒట్టి చేతులతో వృద్ధ దంపతులు. దోపిడి చాలా ఈజీ అనుకున్నారు ఆ దొంగలు. కానీ ఈ వృద్ధ దంపతుల ముందు కుందేలుకేం తెలుసు వడిసెల దెబ్బ అన్నట్టు చివరకు దొంగలు పారిపోయారు. ఇదీ ఇటీవల తమిళనాడులో జరిగిన సంఘటన. ఈ వార్త బాగా వైరల్ కూడా అయింది.

వృద్ధ దంపతుల సాహసం తమిళనాడు సీఎంను కూడా ఆకర్షించింది. అందుకే స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా దంపతులను సీఎం పళనిస్వామి సన్మానించారు. రెండు లక్షల నగదు, స్వర్ణ పతకం, ప్రశంసపత్రం అందచేశారు. ఒక మిల్లులో ఉద్యోగ విరమణ చేసిన తర్వాత షణ్ముగవేలు తన సొంతూరు ఆలంకుళంలో భార్యతో కలిసి ఉంటున్నాడు. వ్యవసాయమంటే వీరికి ఇష్టం. అందుకే తన వ్యవసాయ క్షేత్రంలోనే ఇంటిని నిర్మించుకుని ఉంటున్నారు.

ఈనెల 10న షణ్ముగవేలు వ్యవసాయం గురించి తమిళనాడులోని ఒక ప్రముఖ పక్ష పత్రిక పెద్ద కథనాన్ని కూడా రాసింది. కవర్ పేజీగా దంపతుల ఫోటోను వేసింది. వీరి వ్యవసాయం గురించి వివరించింది. ఈ కథనం ద్వారా దంపతులు వ్యవసాయ క్షేత్రంలో ఉన్నారని తెలుసుకున్నారో ఏమో మరుసటి రోజే దొంగలు పడ్డారు. తొలుత షణ్ముగను బంధించేందుకు ప్రయత్నించారు. ఆసమయంలో అతడి భార్య చేతికి దొరికిన చెప్పులను దొంగలపై విసరసాగింది.

ఇంతలో తేరుకున్న షణ్ముగవేలు అక్కడున్న ప్లాస్టిక్‌ చైర్‌లతో దొంగలపై గ్యాప్‌ లేకుండా దాడి చేయసాగాడు. వృద్ధుల ధాటికి చేతుల్లో వేటకొడవళ్లు ఉన్నా సరే దొంగలిద్దరూ నిమిషానికి మించి పోరాటం చేయలేక పారిపోయారు.

షణ్ముగవేలు ఇంటిపై ఇలా దొంగలు గతంలోనూ రెండు సార్లు దాడి చేశారు. ఆ సమయంలో కూలీల సాయంతో వారిని తరిమినట్టు షణ్ముగవేలు వివరించారు. ఆ తర్వాత తన ఇంటి చుట్టూ 14 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. వృద్ధాప్యం శరీరానికే గానీ.. ధైర్యానికి కాదని… ఆ ధైర్యంతోనే తాము దొంగలను ఎదిరించామని 70ఏళ్ల షణ్ముగవేలు వివరించారు.

First Published:  15 Aug 2019 8:50 PM GMT
Next Story