Telugu Global
National

జగన్‌ దెబ్బకు... బెంగళూరు బిల్డర్లు అబ్బా....

చంద్రబాబు హయాంలో ఇసుక అక్రమ రవాణా టీడీపీ నేతలకు వేల కోట్లు సంపాదించి పెట్టింది. గత ప్రభుత్వం ఇసుక ఉచితమని.. ఎవరైనా కావాల్సినంత తీసుకెళ్లవచ్చని ప్రకటించడంతో టీడీపీ నేతలు రీచ్‌లను అక్రమించేశారు. ప్రజలకు మాత్రం ఎక్కడా ఉచితంగా ఇసుక దొరకలేదు. రాయలసీమకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు అప్పట్లో గుంపుగా ఏర్పడి చిత్రావతి, పెన్నా నదుల నుంచి ఇసుకను యదేచ్చగా బెంగళూరుకు రవాణా చేశారు. అలా చేయడం ద్వారా వందల కోట్లు సంపాదించుకున్నారు. అయితే జగన్‌ ముఖ్యమంత్రి అయిన […]

జగన్‌ దెబ్బకు... బెంగళూరు బిల్డర్లు అబ్బా....
X

చంద్రబాబు హయాంలో ఇసుక అక్రమ రవాణా టీడీపీ నేతలకు వేల కోట్లు సంపాదించి పెట్టింది. గత ప్రభుత్వం ఇసుక ఉచితమని.. ఎవరైనా కావాల్సినంత తీసుకెళ్లవచ్చని ప్రకటించడంతో టీడీపీ నేతలు రీచ్‌లను అక్రమించేశారు. ప్రజలకు మాత్రం ఎక్కడా ఉచితంగా ఇసుక దొరకలేదు. రాయలసీమకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు అప్పట్లో గుంపుగా ఏర్పడి చిత్రావతి, పెన్నా నదుల నుంచి ఇసుకను యదేచ్చగా బెంగళూరుకు రవాణా చేశారు.

అలా చేయడం ద్వారా వందల కోట్లు సంపాదించుకున్నారు. అయితే జగన్‌ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇసుక అక్రమ రవాణాకు చెక్ పెట్టారు. ఇసుక రవాణా బాధ్యతను ప్రభుత్వమే చూసుకుంటుండడం, కొత్త పాలసీ ప్రకటించే వరకు ఇసుక తరలింపుపై ఆంక్షలు విధించింది జగన్ ప్రభుత్వం. రాయలసీమ సరిహద్దుల్లో చెక్‌పోస్టులను అప్రమత్తం చేశారు. ఇసుక లారీ కనిపిస్తే సీజ్ చేస్తున్నారు. దీంతో నెల రోజులుగా బెంగళూరుకు అనంతపురం జిల్లా నుంచి ఇసుక అక్రమ రవాణా పూర్తిగా ఆగిపోయింది.

ఇలా సీమ నుంచి ఇసుక రవాణా జీరోకు పడిపోవడంతో బెంగళూరులో బిల్డర్లు అల్లాడుతున్నారు. టీడీపీ నేతలకు ఫోన్లు చేసి ఇసుక కావాలని కోరుతున్నారు. అయితే ప్రభుత్వం మారిందని… నిఘా పెరిగిందని కాబట్టి తాము ఇసుకను సరఫరా చేయలేమని టీడీపీ నేతలు చేతులెత్తేశారు. దాంతో బెంగళూరు బిల్డర్లు ఇసుకను ఇతర ప్రాంతాలనుంచి దిగుమతి చేసుకునే పనిలో ఉన్నారు. చాలా చోట్ల బెంగళూరులో నిర్మాణాలు తాత్కాలికంగా ఆగిపోయాయి.

దీన్ని బట్టే గత ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక దోపిడి ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. గతంలో ఇసుక దోపిడి కారణంగా రాయలసీమలో చాలా చోట్ల ఉన్న కొద్దిపాటి నీటి వనరులు కూడా అడుగంటిపోయాయని చెబుతున్నారు.

First Published:  15 Aug 2019 11:56 PM GMT
Next Story