Telugu Global
NEWS

బాబు సేఫ్‌... సర్పాల మధ్య ఇంటికి సిబ్బంది కాపలా...

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీరు మరోసారి విమర్శల పాలవుతోంది. కృష్ణా నదికి భారీ వరద మొదలైన వెంటనే చంద్రబాబు హైదరాబాద్‌ వెళ్లిపోయారు. కరకట్ట లింగమనేని భవనాన్ని వరద చుట్టుముట్టబోతోందని ముందే గ్రహించి చంద్రబాబునాయుడు ఇలా సేఫ్ జోన్‌లోకి వెళ్లిపోయారు. ఊహించినట్టుగానే వరద పెరుగుతూ పోతోంది. ఇప్పటికే చంద్రబాబు నివాసాన్ని వరద చుట్టుముట్టింది. ఇంటి పక్కనే ఉన్న అరటి తోటలు, హెలిపాడ్, గార్డెన్‌ అన్ని మునిగిపోయాయి. చంద్రబాబు ఏమో సేఫ్‌గా హైదరాబాద్ చేరుకున్నారు. కానీ చంద్రబాబు ఇంటికి కాపలాగా […]

బాబు సేఫ్‌... సర్పాల మధ్య ఇంటికి సిబ్బంది కాపలా...
X

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీరు మరోసారి విమర్శల పాలవుతోంది. కృష్ణా నదికి భారీ వరద మొదలైన వెంటనే చంద్రబాబు హైదరాబాద్‌ వెళ్లిపోయారు. కరకట్ట లింగమనేని భవనాన్ని వరద చుట్టుముట్టబోతోందని ముందే గ్రహించి చంద్రబాబునాయుడు ఇలా సేఫ్ జోన్‌లోకి వెళ్లిపోయారు. ఊహించినట్టుగానే వరద పెరుగుతూ పోతోంది. ఇప్పటికే చంద్రబాబు నివాసాన్ని వరద చుట్టుముట్టింది.

ఇంటి పక్కనే ఉన్న అరటి తోటలు, హెలిపాడ్, గార్డెన్‌ అన్ని మునిగిపోయాయి. చంద్రబాబు ఏమో సేఫ్‌గా హైదరాబాద్ చేరుకున్నారు. కానీ చంద్రబాబు ఇంటికి కాపలాగా ఉన్న భద్రతా సిబ్బంది, ఇతర పనివాళ్లు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. చుట్టూ పంట పొలాలు ఉండడం, అవన్ని నీట మునగడంతో విషసర్పాలు కూడా బుసకొడుతున్నాయి.

చంద్రబాబు ఇంటికి కాపుకాస్తున్న వారికి ఇప్పుడు పాముల భయం వెంటాడుతోంది. వరద తగ్గేవరకు తాము కూడా సురక్షి ప్రాంతాలకు వెళ్లాలని సిబ్బంది భావించినా టీడీపీ పెద్దలు అంగీకరించలేదని చెబుతున్నారు. దాంతో చుట్టూ వరద… మధ్యలోనే బాబు ఇంటికి కాపు కాస్తున్నారు. ఇసుక బస్తాలు వేసినా అవేవీ వరదను అడ్డుకోలేకపోతున్నాయి. నీరు వచ్చేస్తోంది.

ఇప్పటికే ఉండవల్లి వీఆర్‌వో స్వయంగా వెళ్లి చంద్రబాబు ఇంటి వద్ద ఉన్న సిబ్బందికి నోటీసులు కూడా ఇచ్చారు. వరద సమయంలో ఇక్కడ ఉండడం సురక్షితం కాదని, ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఆదేశించారు. అయితే చంద్రబాబు నుంచి ఆదేశాలు రాకుండా తామేమి చేయలేమని సిబ్బంది ఆందోళన చెందుతున్నారు.

First Published:  17 Aug 2019 12:13 AM GMT
Next Story