Telugu Global
NEWS

చంద్రబాబుకి ఈయ‌న షాకిస్తారా ? ఈ వ‌య‌సులో కీల‌క నిర్ణ‌యం తీసుకుంటారా ?

ఏపీ నుంచి హైద‌రాబాద్ లో మ‌కాం వేసిన చంద్ర‌బాబుని తెలంగాణ తెలుగుదేశం కీల‌క నేత‌లు క‌లుస్తున్నారు. పార్టీ వీడే స‌మ‌యం వ‌చ్చింద‌ని చంద్ర‌బాబుకి తెగేసి చెబుతున్నారు. ఇటు చంద్ర‌బాబు కూడా త‌న‌వాళ్ల‌ను బీజేపీలోకి పంపాల‌ని ఎత్తుగ‌డ‌తో చాలా రోజులుగా ఉన్నారు. అనుకున్న‌ట్లుగానే వ్యూహాత్మ‌కంగా తెలంగాణ బీజేపీలోకి కూడా కొంద‌రు నేత‌లను పంపిస్తున్న‌ట్లు తెలుస్తోంది. మాజీమంత్రి, మాజీ రాజ్యసభ సభ్యుడు టి.దేవేందర్ గౌడ్ త్వరలో బీజేపీలో చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అనారోగ్య కార‌ణాల‌తో ఆయ‌న క్రియాశీల‌క రాజ‌కీయాల‌కు కొన్నాళ్లుగా […]

చంద్రబాబుకి ఈయ‌న షాకిస్తారా ? ఈ వ‌య‌సులో కీల‌క నిర్ణ‌యం తీసుకుంటారా ?
X

ఏపీ నుంచి హైద‌రాబాద్ లో మ‌కాం వేసిన చంద్ర‌బాబుని తెలంగాణ తెలుగుదేశం కీల‌క నేత‌లు క‌లుస్తున్నారు. పార్టీ వీడే స‌మ‌యం వ‌చ్చింద‌ని చంద్ర‌బాబుకి తెగేసి చెబుతున్నారు. ఇటు చంద్ర‌బాబు కూడా త‌న‌వాళ్ల‌ను బీజేపీలోకి పంపాల‌ని ఎత్తుగ‌డ‌తో చాలా రోజులుగా ఉన్నారు. అనుకున్న‌ట్లుగానే వ్యూహాత్మ‌కంగా తెలంగాణ బీజేపీలోకి కూడా కొంద‌రు నేత‌లను పంపిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

మాజీమంత్రి, మాజీ రాజ్యసభ సభ్యుడు టి.దేవేందర్ గౌడ్ త్వరలో బీజేపీలో చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అనారోగ్య కార‌ణాల‌తో ఆయ‌న క్రియాశీల‌క రాజ‌కీయాల‌కు కొన్నాళ్లుగా దూరంగా ఉంటున్నారు. అయితే త‌న కొడుకు భ‌విష్య‌త్ కోసం ఆయ‌న పార్టీ మారే నిర్ణ‌యానికి వ‌చ్చార‌ని ఓ వార్త వైర‌ల్ అవుతోంది.

దేవేంద‌ర్ గౌడ్ త‌న‌యుడు వీరేంద‌ర్ గౌడ్ 2014లో చేవేళ్ల ఎంపీగా పోటీ చేశారు. ఆత‌ర్వాత మొన్న‌టి ఎన్నిక‌ల్లో ఉప్ప‌ల్ నుంచి పోటీ చేశారు. రెండు సార్లూ ఓడిపోయారు. రాజ్య‌స‌భ స‌భ్యునిగా ఉన్నప్పుడు బీజేపీకి అనుకూలంగా దేవేంద‌ర్‌గౌడ్ చాలా సార్లు ఓటేశారు. ఇప్ప‌టికే బీజేపీ జాతీయ నాయ‌క‌త్వం ఆయ‌న‌తో చ‌ర్చ‌లు జ‌రిపిన‌ట్లు తెలుస్తోంది.

తెలంగాణ‌లో పాగా కోసం ప్ర‌య‌త్నిస్తున్న బీజేపీ…బీసీల్లో ముఖ్యంగా గౌడ వ‌ర్గంలో దేవేంద‌ర్‌కు అంతో ఇంతో ప‌ట్టుంది. ఆ సామాజిక వ‌ర్గం ఫేస్‌గా ఆయ‌న ఉన్నారు. ఈవ‌ర్గంలో బీజేపీకి పేరున్న నేత లేరు. దీంతో ఈ వ‌ర్గాన్ని ఆకట్టుకునేందుకు దేవేంద‌ర్ గౌడ్ లాంటి నేత స‌రిపోతార‌నేది బీజేపీ నేతల అభిప్రాయం.

అయితే దేవేంద‌ర్‌గౌడ్ బీజేపీలోకి వెళ‌తారా? లేక ఇదో గాలి వార్తా? అనేది త్వరలో తేల‌బోతుంది.

First Published:  16 Aug 2019 8:19 PM GMT
Next Story