మమ్మల్ని జంతువుల్లా బంధించారు…

కశ్మీర్‌ ప్రజల పట్ల భారత ప్రభుత్వం అమానుషంగా వ్యవహరిస్తోందని కశ్మీర్ మాజీ సీఎం మొహబూబా ముఫ్తీ కుమార్తె ఇల్తిజా మండిపడ్డారు.తమను గృహనిర్బంధంలో ఉంచడంపై ఆమె స్పందించారు.

ప్రభుత్వ విధానాన్ని వ్యతిరేకిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఆమె లేఖ రాశారు. కశ్మీర్‌లో కనీస మానవహక్కులు లేకుండా హరించారని లేఖలో మండిపడ్డారు.

కశ్మీర్ ప్రజలను జంతువుల తరహాలో బంధించారని ఆరోపించారు. తనను కూడా కాలు బయటకు పెట్టనివ్వడం లేదని.. ఎవరినీ కలిసేందుకు అనుమతించడం లేదన్నారు. తనకు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదని.. అయినా సరే ఎందుకు ఇలా బంధించారని ఆమె లేఖలో ప్రశ్నించారు.

ఇప్పటికైనా కశ్మీర్ ప్రజలకు నిర్బంధం నుంచి విముక్తి కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు.