చిత్రబృందం పై కాజల్… ‘రణరంగం’

‘కవచం’ , ‘సీత’ సినిమాలతో వరుస డిజాస్టర్ లను అందుకున్న టాలీవుడ్ స్టార్ బ్యూటీ కాజల్ అగర్వాల్ తన ఆశలన్నీ ఈ మధ్యనే విడుదలైన ‘రణరంగం’ సినిమా పై పెట్టుకుంది.

శర్వానంద్ హీరోగా సుధీర్వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కాజల్ మరియు కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్లుగా నటించారు.

అయితే ఈ సినిమా విడుదలైన మొదటి రోజు నుంచే ఫ్లాప్ టాక్ ను తెచ్చుకుంది. సినిమా సక్సెస్ గురించి పక్కన పెట్టేస్తే కాజల్ అభిమానులు మాత్రం ఈ సినిమా విషయంలో నిరాశ చెందినట్లు తెలుస్తోంది. దానికి కారణం ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ కు ప్రాధాన్యత లేకపోవడం.

చిన్న పాత్ర అయినప్పటికీ… ఈ సినిమాలో నటించినందుకు కాజల్ అగర్వాల్ కి ధన్యవాదాలు కూడా చెప్పాడు శర్వానంద్. సినిమా చూసిన అందరూ అసలు ఈ సినిమాలో నటించడానికి కాజల్ అగర్వాల్ ఎలా ఒప్పుకుంది అంటూ సందేహిస్తున్నారు.

అయితే తాజా సమాచారం ప్రకారం కాజల్ అగర్వాల్ నటించిన కొన్ని సన్నివేశాలను దర్శకనిర్మాతలు కట్ చేశారట. ఆఖరికి కాజల్ మీద చిత్రీకరించిన ఒక గ్లామర్ సాంగ్ ని కూడా సినిమా నుంచి తీసేశారట. ఈ నేపథ్యంలో కాజల్ అభిమానులు మాత్రమే కాక కాజల్ కూడా అప్సెట్ అయినట్లు తెలుస్తోంది.