హెబ్బా తో… కౌశల్

ఒకప్పుడు కేవలం సీరియల్స్ లో మాత్రమే నటించే వాడిగా కొందరికి మాత్రమే పరిచయం ఉన్న కౌశల్… బిగ్ బాస్ సీజన్ 2 తో బోలెడంత పాప్యులారిటీ సంపాదించాడు.

బిగ్ బాస్ షో కౌశల్ కెరీర్ ని పూర్తిగా మార్చేసింది. కౌశల్ బిగ్ బాస్ సీజన్ 2 టైటిల్ కూడా గెలుచుకున్న సంగతి తెలిసిందే. కౌశల్ ని హీరోగా పెట్టి చాలా మంది దర్శకులు సినిమాలు తీయడానికి ముందుకు వస్తున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. కానీ దీని గురించి అధికారిక ప్రకటన ఏమీ బయటకు రాలేదు.

అయితే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేసిన తరువాత చాలా కాలం సైలెంట్ గా ఉన్నా కౌశల్ తాజాగా హీరోయిన్ హెబ్బా పటేల్ తో కలిసి తను దిగిన ఒక ఫొటోని సోషల్ మీడియా ద్వారా షేర్ చేశాడు.

తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు వారిద్దరూ కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారట. అయితే ఇది సినిమా కాదు. కౌశల్, హెబ్బా పటేల్ కలిసి శ్రీరామ్ గోల్డ్ లోన్ యాడ్ లో పని చేయబోతున్నారు. దీనికి సంబంధించిన షూటింగ్ త్వరలోనే మొదలు కానుంది.

ఇది ఇలా ఉండగా మరో వైపు గత కొంతకాలంగా సినిమా ఆఫర్లు లేని హెబ్బా పటేల్ త్వరలో బిగ్ బాస్ సీజన్ త్రీ లోకి ఎంటర్ అవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Titles comes & goes…But my multitasking remains the same…Directing Hebah Patel for Shriram Gold loan AD film @ihebahp

Posted by Kaushal Manda on Tuesday, 13 August 2019