మన్మథుడికి మరో 10 కోట్లు కావాలంట

విడుదలైన రోజే ఈ సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చేసింది. ఆ తర్వాత ఫ్లాప్ టాక్ గా మారింది. ఆ వెంటనే డిజాస్టర్ అనిపించుకుంది కూడా. ఇలాంటి టాక్ తో సినిమా ఎక్కువ రోజులు ఆడదని, బ్రేక్-ఈవెన్ అవ్వడం అసాధ్యమని రిలీజైన రెండో రోజే అంచనా వేసింది ట్రేడ్. ఇప్పుడదే జరిగింది.

మన్మథుడు-2 రిలీజై 8 రోజులైంది. ఈ 8 రోజుల్లో సినిమాకు అటుఇటుగా కేవలం 11 కోట్ల రూపాయల షేర్ మాత్రమే వచ్చింది. సినిమాను 20 కోట్ల 60 లక్షల రూపాయలకు అమ్మారు. సో.. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే అటుఇటుగా మరో 10 కోట్లు రావాలి. వారం దాటిన సినిమాకు అదనంగా మరో 10 రావాలంటే ఈకాలం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. పైగా ఈ టాక్ తో మరో వారం సినిమాను నడిపించడం గగనం.

సూపర్ హిట్ టాక్ వచ్చిన సినిమాకు మాత్రమే రెండో వారం కూడా స్కోప్ ఉంటుంది. ఇలా ఫ్లాప్ టాక్ వచ్చిన సినిమాను రెండో వారం ఎవ్వరూ చూడరు. పైగా ఈ వారం విడుదలైన ఎవరు సినిమాకు సూపర్ హిట్ టాక్ వచ్చేసింది. అటు రణరంగం సినిమా కూడా ప్రస్తుతానికి నడుస్తూనే ఉంది. ఈ రెండు సినిమాల్ని కాదని, మన్మథుడు-2 కోసం ఎగబడే ప్రేక్షకులైతే లేరు.