Telugu Global
National

టీవీలు వద్దు.... సెల్ ఫోన్లే ముద్దు

దేశంలో టీవీల అమ్మకాలు నానాటికి తగ్గిపోతున్నాయి. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం టీవీల అమ్మకాలు 20 శాతం తగ్గిపోయినట్లుగా మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. మరో వైపు సెల్ ఫోన్ అమ్మకాలు నానాటికి పెరుగుతున్నాయి. టీవీల అమ్మకాలు తగ్గిపోవడానికి మార్కెట్లో రోజు రోజుకు కొత్త కొత్త సెల్‌ఫోన్‌ సేవలు రావడమే కారణమని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. మార్కెట్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న మోడల్స్ స్దానంలో సరికొత్త హంగులతో టీవీలు వస్తాయని, ఆ సమయంలో కొనుగోలు చేయవచ్చునని వినియోగదారులు […]

టీవీలు వద్దు.... సెల్ ఫోన్లే ముద్దు
X

దేశంలో టీవీల అమ్మకాలు నానాటికి తగ్గిపోతున్నాయి. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం టీవీల అమ్మకాలు 20 శాతం తగ్గిపోయినట్లుగా మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

మరో వైపు సెల్ ఫోన్ అమ్మకాలు నానాటికి పెరుగుతున్నాయి. టీవీల అమ్మకాలు తగ్గిపోవడానికి మార్కెట్లో రోజు రోజుకు కొత్త కొత్త సెల్‌ఫోన్‌ సేవలు రావడమే కారణమని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

మార్కెట్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న మోడల్స్ స్దానంలో సరికొత్త హంగులతో టీవీలు వస్తాయని, ఆ సమయంలో కొనుగోలు చేయవచ్చునని వినియోగదారులు భావించడం వల్ల టీవీల అమ్మకాలు తగ్గిపోయాయని కొందరు చెబుతున్నారు. టీవీ అమ్మకాలు తగ్గిపోవడానికి ప్రభుత్వం విధిస్తున్న జీఎస్టీ కూడా ప్రధాన కారణమని చెబుతున్నారు.

గడచిన కొంత కాలంగా ప్రతీ ఏటా 20 శాతం వరకూ టీవీ అమ్మకాలు పెరుగుతూ వచ్చాయి. ఈ సంవత్సరం మాత్రం టీవీ విక్రయాలు కేవలం మూడు శాతం మాత్రమే పెరిగాయని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.

టీవీ అమ్మకాలు తగ్గిపోతున్న దశలోనే సెల్ ఫోన్ల అమ్మకాలు భారీగా పెరుగుతుండడం గమనార్హం. సెల్ ఫోన్లకు తక్కువ ఖర్చుతో ఇంటర్నెట్ సౌకర్యం, అన్ని భాషల ఛానళ్లు సెల్ ఫోన్‌లో చూసుకునే సౌకర్యం ఉండడం… దీంతో నిరంతరం తమ వెంట ఉండే సెల్ ఫోన్లకు వినియోగదారులు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.

జియోతో సహ వివిధ నెట్ వర్క్ సంస్ధలు తక్కువ ఖర్చుతో భారీ ఆఫర్లు ఇవ్వడంతో వినియోగదారులు వాటివైపే మొగ్గుతున్నారు. సెల్ ఫోన్లలో కూడా పెద్ద పెద్ద స్క్రీన్లు ఉన్న మోడల్స్ రావడంతో సెల్ ఫోన్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ కారణాలతో దేశంలో టీవీ అమ్మకాలు ఈ సంవత్సరం భారీగా తగ్గాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

First Published:  17 Aug 2019 5:43 AM GMT
Next Story