Telugu Global
NEWS

లోకేష్‌ ట్వీట్‌తో మూర్చబోతున్న నీటి రంగ నిపుణులు

నారా లోకేష్‌ ట్విట్టర్‌ ద్వారా తన ప్రతిష్టను తానే కూల్చేసుకుంటున్నారు. చంద్రబాబు నివాసం ఉంటున్న కరకట్ట భవనాన్ని వరద చుట్టుముట్టిన నేపథ్యంలో నారా లోకేష్ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు. చంద్రబాబు ఇంటిని ముంచేలా వరదను ప్రభుత్వమే మళ్లిస్తోందని ట్విట్టర్‌లో ఆరోపించారు. అందుకు లోకేష్ చెప్పిన లెక్క సాగునీటి రంగ నిపుణులకే ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. నాగార్జున సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు. ప్రస్తుతం 586 అడుగుల నీరు ఉంది. ఎగువ నుంచి వస్తున్న వరదను కిందకు వదులుతున్నారు. దీన్ని […]

లోకేష్‌ ట్వీట్‌తో మూర్చబోతున్న నీటి రంగ నిపుణులు
X

నారా లోకేష్‌ ట్విట్టర్‌ ద్వారా తన ప్రతిష్టను తానే కూల్చేసుకుంటున్నారు. చంద్రబాబు నివాసం ఉంటున్న కరకట్ట భవనాన్ని వరద చుట్టుముట్టిన నేపథ్యంలో నారా లోకేష్ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు.

చంద్రబాబు ఇంటిని ముంచేలా వరదను ప్రభుత్వమే మళ్లిస్తోందని ట్విట్టర్‌లో ఆరోపించారు. అందుకు లోకేష్ చెప్పిన లెక్క సాగునీటి రంగ నిపుణులకే ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

నాగార్జున సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు. ప్రస్తుతం 586 అడుగుల నీరు ఉంది. ఎగువ నుంచి వస్తున్న వరదను కిందకు వదులుతున్నారు. దీన్ని లోకేష్ తప్పుపడుతున్నారు. సాగర్‌లో ఇంకా నాలుగు అడుగుల మేర నిల్వకు అవకాశం ఉన్నా సరే అధిక ప్రవాహాన్ని సాగర్‌ నుంచి ప్రకాశం బ్యారేజ్ వైపు వదులుతున్నారు. చంద్రబాబు ఇంటిని ముంచే ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నారని లోకేష్‌ ట్విట్టర్‌ లో ఆరోపించారు.

ఎప్పుడైనా పై నుంచి భారీ వరద వస్తున్నప్పుడు ప్రాజెక్టు భద్రతను దృష్టిలో ఉంచుకుని కొన్ని అడుగుల మేర గ్యాప్‌ మెయింటెయిన్‌ చేస్తారు. అలా చేయకపోతే హఠాత్తుగా ఎగువ నుంచి వరద పెరిగితే ప్రాజెక్టే నాశనం అయిపోతుంది. ఇంత చిన్న విషయం కూడా తెలియకుండా ట్వీట్లు చేస్తే అది… లోకేష్ స్థాయిని పడగొట్టడానికి పనికొస్తాయి గానీ… పెంచేది కానేకాదు.

అలాగే పడవలు అడ్డుపెట్టి ప్రవాహాన్ని అడ్డుకుంటున్నారు…. అంటూ చేసిన ట్వీట్‌ కూడా హాస్యాస్పదంగా ఉందని అంటున్నారు.

First Published:  17 Aug 2019 1:59 AM GMT
Next Story