Telugu Global
Cinema & Entertainment

తన పారితోషికం బయటపెట్టిన ప్రభాస్

బాహుబలి-2 తర్వాత ప్రభాస్ ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. అతడు ఒక్కసారిగా నేషనల్ లెవెల్ స్టార్ అయిపోయాడు. ఉత్తరాది జనాలు కూడా ప్రభాస్ అప్ డేట్స్ ఫాలో అవ్వడం ప్రారంభించారు. అతడి మార్కెట్ డబుల్, ట్రిపుల్ కాదు.. ఏకంగా 10 రెట్లు పెరిగింది. అలాంటప్పుడు ప్రభాస్ తన పారితోషికాన్ని పెంచకుండా ఉంటాడా? కచ్చితంగా పెంచే ఉంటాడు. కానీ ఇక్కడే అందరికీ షాకిచ్చాడు ప్రభాస్. పారితోషికం పెంచడం మాట అటుంచి, తను రెగ్యులర్ గా తీసుకునే మొత్తం కూడా తీసుకోలేదని […]

తన పారితోషికం బయటపెట్టిన ప్రభాస్
X

బాహుబలి-2 తర్వాత ప్రభాస్ ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. అతడు ఒక్కసారిగా నేషనల్ లెవెల్ స్టార్ అయిపోయాడు. ఉత్తరాది జనాలు కూడా ప్రభాస్ అప్ డేట్స్ ఫాలో అవ్వడం ప్రారంభించారు. అతడి మార్కెట్ డబుల్, ట్రిపుల్ కాదు.. ఏకంగా 10 రెట్లు పెరిగింది.

అలాంటప్పుడు ప్రభాస్ తన పారితోషికాన్ని పెంచకుండా ఉంటాడా? కచ్చితంగా పెంచే ఉంటాడు. కానీ ఇక్కడే అందరికీ షాకిచ్చాడు ప్రభాస్. పారితోషికం పెంచడం మాట అటుంచి, తను రెగ్యులర్ గా తీసుకునే మొత్తం కూడా తీసుకోలేదని ప్రకటించాడు ప్రభాస్.

“సాహో బడ్జెట్ ఇంత పెరిగిపోతుందని మేం ఊహించలేదు. ఇంకా చెప్పాలంటే డబుల్ అయిపోయింది. అక్షరాలా 350 కోట్లు ఖర్చుపెట్టాం. ఇలాంటి టైమ్ లో నేను నా పారితోషికం తీసుకోవడం కరెక్ట్ కాదు. పైగా నిర్మాతలంతా నా ఫ్రెండ్స్. కలిసి పెరిగాం. అందుకే నేను నా రెగ్యులర్ పారితోషికంలో 20శాతం మాత్రమే తీసుకున్నాను.”

ఇలా సాహో సినిమా రెమ్యునరేషన్ విషయంలో అసలు సంగతి బయటపెట్టాడు ప్రభాస్. ఓ తమిళ వెబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ప్రభాస్.. తను అస్సలు పట్టించుకోని అంశాల్లో పారితోషికం ఒకటని స్పష్టంచేశాడు. చివరికి ఐదేళ్లు కష్టపడి చేసిన బాహుబలి ప్రాజెక్టుకు కూడా పెద్దగా రెమ్యూనరేషన్ తీసుకోలేదని, సాహో కోసమైతే తన రెగ్యులర్ రెమ్యూనరేషన్ లో 20శాతం మాత్రమే తీసున్నానని అంటున్నాడు. ఈ మంచితనంతోనే అందరితో డార్లింగ్ అనిపించుకుంటున్నాడు ప్రభాస్.

First Published:  17 Aug 2019 3:36 AM GMT
Next Story