మాఫియా సినిమాలో లవ్ ట్రాక్ నచ్చిందట

కుటుంబ కథాచిత్రంగా తెరకెక్కిన మన్మథుడు-2లో రొమాన్స్ ఎలిమెంట్స్ తనకు చాలా బాగా నచ్చాయన్నాడు నాగార్జున. కుటుంబ కథాచిత్రం అంటూనే రొమాన్స్ నచ్చిందనడంతో అంతా ఖంగుతిన్నారు. ఇప్పుడు శర్వానంద్ కూడా దాదాపు అదే విధంగా మాట్లాడాడు. గ్యాంగ్ స్టర్ కథతో తెరకెక్కిన రణరంగంలో లవ్ ట్రాక్ తనకు బాగా నచ్చిందంటున్నాడు. తన కెరీర్ లో బెస్ట్ లవ్ ట్రాక్ ఇదేనంటున్నాడు.

“ఈ సినిమాలో కల్యాణి, నాకూ మధ్య లవ్ స్టోరీ ఇప్పటివరకు నేను చేసిన లవ్ స్టొరీలన్నింటి కంటే బెస్ట్ అంటున్నారు. మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయ్యిందంటున్నారు. చాలా హ్యాపీగా ఉంది.”

చూశారుగా.. రణరంగం సినిమాపై శర్వానంద్ రియాక్షన్ ఇది. అయితే లవ్ ట్రాక్ తో పాటు మిగతా ఎలిమెంట్స్ కూడా తనకు బాగా నచ్చాయని, సినిమా అందరికీ నచ్చుతుందనే నమ్మకం తనకు ఉందని అంటున్నాడు. సమీక్షల్ని గౌరవిస్తానని ప్రకటించిన శర్వానంద్.. సమీక్షలకు అతీతంగా సినిమా హిట్ అవుతుందంటున్నాడు.

“రణరంగం’కు మంచి ఓపెనింగ్స్ వచ్చినందుకు హ్యాపీగా ఉంది. ప్రేక్షకులకు ఒక స్క్రీన్‌ప్లే బేస్డ్ సినిమా ఇవ్వాలనుకొని, ఒక ప్రోపర్ యాక్షన్ ఫిల్మ్ తియ్యాలనుకొని ‘రణరంగం’ చేశాం. ఆ విషయంలో 200 శాతం సక్సెస్ అయ్యాం. ఇటీవల తెలుగులో వచ్చిన బెస్ట్ క్వాలిటీ ఫిల్మ్ అని ప్రశంసిస్తుంటే ఆనందంగా ఉంది. సినిమాటోగ్రఫీ, ఆర్ట్ వర్క్ సూపర్బ్ అనే పేరొచ్చింది. ఫైట్ సీన్స్‌ని వెంకట్ మాస్టర్ చాలా నేచురలిస్టిగ్గా కంపోజ్ చేశారు.”

రణరంగం సినిమాకు భారీగా ఖర్చుచేశారు సితార ఎఁటర్ టైన్ మెంట్స్ నిర్మాతలు. ప్రస్తుతం నడుస్తున్న టాక్ పరంగా చూసుకుంటే.. పెట్టినంతా రికవర్ అవ్వడం కష్టమనే చెప్పాలి. సోమవారం నాటికి ఈ సినిమా అసలు రంగు బయటపడుతుంది.