Telugu Global
NEWS

సచిన్ టెస్ట్ సిక్సర్ల రికార్డు సమం

గాల్ టెస్ట్ లో టిమ్ సౌథీ ఘనత సాంప్రదాయ టెస్ట్ క్రికెట్లో మాస్టర్ సచిన్ టెండుల్కర్ సాధించిన సిక్సర్ల రికార్డును…కివీ బౌలింగ్ ఆల్ రౌండర్ టిమ్ సౌథీ సమం చేశాడు. గాల్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా శ్రీలంకతో జరిగిన తొలిటెస్ట్ రెండో రోజు ఆటలో లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ కు దిగిన సౌథీ.. స్పిన్నర్ అఖిల ధనంజయ బౌలింగ్ లో సిక్సర్ బాదడం ద్వారా..క్రికెట్ ఆల్ టైమ్ గ్రేట్ మాస్టర్ సచిన్ పేరుతో ఉన్న 69 సిక్సర్ల […]

సచిన్ టెస్ట్ సిక్సర్ల రికార్డు సమం
X
  • గాల్ టెస్ట్ లో టిమ్ సౌథీ ఘనత

సాంప్రదాయ టెస్ట్ క్రికెట్లో మాస్టర్ సచిన్ టెండుల్కర్ సాధించిన సిక్సర్ల రికార్డును…కివీ బౌలింగ్ ఆల్ రౌండర్ టిమ్ సౌథీ సమం చేశాడు.

గాల్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా శ్రీలంకతో జరిగిన తొలిటెస్ట్ రెండో రోజు ఆటలో లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ కు దిగిన సౌథీ.. స్పిన్నర్ అఖిల ధనంజయ బౌలింగ్ లో సిక్సర్ బాదడం ద్వారా..క్రికెట్ ఆల్ టైమ్ గ్రేట్ మాస్టర్ సచిన్ పేరుతో ఉన్న 69 సిక్సర్ల రికార్డును సమం చేయగలిగాడు.

200 టెస్టుల్లో సచిన్ 69 సిక్సర్లు…

మాస్టర్ సచిన్ తన సుదీర్ఘ టెస్ట్ కెరియర్ లో 200 టెస్టులు ఆడి 51 సెంచరీలతో పాటు 69 సిక్సర్లు సాధించాడు. సెంచరీలు, పరుగుల్లో మాత్రమే ప్రపంచ రికార్డు నెలకొల్పినా..సిక్సర్ల బాదుడులో 17వ స్థానం మాత్రమే సాధించాడు.

అయితే…కివీ లోయర్ ఆర్డర్ ఆటగాడు టిమ్ సౌథీ మాత్రం..66 టెస్టులు…96 ఇన్నింగ్స్ లోనే 69 సిక్సర్లు సాధించడం ద్వారా మాస్టర్ సరసన నిలిచాడు.

ఏబీ డివిలియర్స్, సనత్ జయసూర్య, ఇయాన్ బోథమ్ లాంటి దిగ్గజాల కంటే టిమ్ సౌథీ అత్యధిక సిక్సర్లు సాధించడం విశేషం.
సిక్సర్ల బాదుడులో మెకల్లమ్ టాప్… టెస్ట్ చరిత్రలో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడి ఘనతను న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ బ్రెండన్ మెకల్లమ్ పేరుతో ఉంది.

మెకల్లమ్ తన కెరియర్ లో మొత్తం 107 సిక్సర్లతో ప్రపంచ నంబర్ వన్ గా నిలిచాడు. 91 సిక్సర్లతో వీరేంద్ర సెహ్వాగ్ రెండు, 78 సిక్సర్లతో ధోనీ మూడు స్థానాలలో ఉన్నారు.

First Published:  16 Aug 2019 7:20 PM GMT
Next Story