పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చిన శర్వానంద్

ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ లో పెళ్లి కానీ హీరోలు చాలామంది ఉన్నారు. అందులో శర్వానంద్ కూడా ఒకడు. శర్వానంద్, రామ్ చరణ్ ఒకే వయసుకి చెందినవారు.

ఒకవైపు రామ్ చరణ్ పెళ్లి చేసుకుని స్థిరపడినప్పటికీ శర్వానంద్ మాత్రం తన పెళ్లి ఊసు కూడా ఎత్తడం లేదు. అయితే ఇంతకు ముందు వరకు పెళ్లి గురించి ప్రశ్న వస్తే తప్పించుకోవడానికి ప్రయత్నించిన శర్వానంద్ ఇప్పుడు మాత్రం ఈ ప్రశ్నకి క్లారిటీ ఇచ్చాడు.

ఇంతకుముందు వరకు పెళ్లి గురించి ఎప్పుడు అడిగినా తన తల్లిదండ్రులు ఇప్పటికే తన కోసం సంబంధాలు చూస్తున్నారని కాబట్టి తను దాని గురించి మాట్లాడనని చెప్పేవాడు శర్వానంద్.

కానీ ఈ సారి మాత్రం తన జవాబును మార్చాడు శర్వానంద్. ‘రణరంగం’ సినిమా ప్రమోషన్స్ లో పలు ఇంటర్వ్యూలలో పాల్గొన్న శర్వానంద్ కి మళ్ళీ తన పెళ్లి గురించిన ప్రశ్న ఎదురైంది.

ఈ నేపథ్యంలో మాట్లాడుతూ…. ప్రస్తుతానికి అయితే తనకి అలాంటి ఆలోచన ఏమీ లేనప్పటికీ… త్వరలోనే తన పెళ్లి గురించిన క్లారిటీ ఇస్తానని చెప్పాడు శర్వా.

ఇక సుధీర్వర్మ దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా విడుదలైన ‘రణరంగం’ సినిమా బాక్సాఫీస్ వద్ద రన్ అవుతోంది.

ఇంకా తన తదుపరి సినిమా గురించి అధికారిక ప్రకటన, సినిమా గురించిన వివరాలను అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.