బరి నుంచి తప్పుకున్న వెంకీ మామ

సైరా లాంటి భారీ సినిమా బరిలో ఉన్నప్పటికీ వెంకీ మామ తగ్గలేదు. దసరా బరిలో వచ్చి తీరతామని ఒకటికి రెండు సార్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో చిరు-వెంకీ మధ్య బాక్సాఫీస్ వార్ తప్పదని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడా పోటీ తుస్సుమంది. రేసు నుంచి వెంకీ మామ తప్పుకున్నాడు. వెంకటేష్ కు గాయమైందట. షూటింగ్ లేట్ అవుతోందట. అందుకే రిలీజ్ డేట్ ను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.

అక్టోబర్ 2న సైరా సినిమా థియేటర్లలోకి రానుంది. అక్టోబర్ 4న వెంకీమామ రిలీజ్ అవుతుందంటూ బయ్యర్లకు చెప్పేశారు నిర్మాత సురేష్ బాబు.

దీంతో చాలామంది డిస్ట్రిబ్యూటర్లు భయపడ్డారు. కానీ ఇప్పుడా భయం అక్కర్లేదు. కాలు బెణకడంతో షూటింగ్ కు హాజరుకాలేని స్థితిలో ఉన్నాడట వెంకటేష్. కాబట్టి సినిమా విడుదల అక్టోబర్ 4న కష్టం అంటున్నారు.

వెంకీమామకు సంబంధించి కొత్త విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే అక్టోబర్ చివరి వారంలో లేదా నవంబర్ ఫస్ట్ వీక్ లో వెంకీమామ థియేటర్లలోకి వస్తుంది. బాబి డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వెంకీ, నాగచైతన్య హీరోలుగా… పాయల్, రాశిఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్న విషయం తెలిసిందే.