విజయ్…. ఆ ఇమేజ్ వద్దనుకుంటున్నాడా?

డియర్ కామ్రేడ్ సినిమా అనుకున్నంత హిట్ కాలేకపోవడమో…. లేక మరో కారణమో తెలియదు కానీ ఇండస్ట్రీ లో ని కొంత మంది మాత్రం హీరో విజయ్ దేవరకొండ లో చాలా మార్పు వచ్చిందని అంటున్నారు.

అయితే సరైన కారణం ఏది అనేది తెలియదు కానీ విజయ్ మాట తీరు మాత్రం చాలా మారింది అంటున్నారు కొందరు. యూత్ లో మంచి క్రేజ్ ని సంపాధించుకున్న విజయ్ దేవరకొండ… ఎప్పటికప్పుడు తన పంథా ని మార్చుకుంటూ అభిమానులకి నచ్చే విధంగా ట్రై చేస్తూ వస్తున్నాడు. అయితే రౌడీ ఇమేజ్ అనేది ఒక దానిని సృష్టించుకున్న విజయ్ దాని నుండి బయటకు రావడానికి మాత్రం చాలానే కష్ట పడుతున్నాడు.

ప్రతి సారి పబ్లిక్ లో విజయ్ మాట్లాడేప్పుడు తన హావభావాలు కానీ, తన బాడీ లాంగ్వేజ్ మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంటుంది. కానీ ఇటీవలే సైమా వేడుక లో మాట్లాడేప్పుడు మాత్రం విజయ్ మాటలో, ప్రవర్తన లో చాలా తేడా గమనించారు జనాలు. చాలా శాంతం గా, డిఫరెంట్ గా మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచాడు. బహుశా ఆ ఇమేజ్ నుంచి బయటకు రావడానికి చేస్తున్న హోమ్ వర్క్ లో ఇది కూడా భాగమేమోనని అంటున్నారు కొందరు.