సైరాలో అనుష్క పాత్ర ఇదేనా?

సైరాలో మెయిన్ హీరోయిన్ గా నయనతార నటించింది. మరో కీలక పాత్రలో తమన్న కూడా నటించిది. ఇంకో చిన్న పాత్రలో కొణెదల నిహారిక కూడా నటించిందనే విషయం తెలిసిందే.

అయితే ఈ సినిమాలో అనుష్క కూడా ఉందనే విషయాన్ని మాత్రం మేకర్స్ బయటపెట్టడం లేదు. అనుష్కను సస్పెన్స్ ఎలిమెంట్ గా ఉంచారు. ఆమె పాత్రను ఎంత సీక్రెట్ గా ఉంచితే, సినిమా అంత హిట్ అవుతుందని మెగా కాంపౌండ్ భావిస్తోంది.

అయితే ఈ విషయాన్ని కాంపౌండ్ ఎంత దాచాలని ప్రయత్నిస్తుంటే.. ఆ మేటర్ అంతగా బయటకు పొక్కుతోంది. ఇది కూడా ఓ రకంగా సినిమా ప్రచారానికి పనికొస్తున్నప్పటికీ, అసలు మేటర్ ముందే బయటకు వచ్చేస్తుందనే భయం మాత్రం సైరా యూనిట్ లో ఉంది.

ఇంతకీ సైరా సినిమాలో అనుష్క పాత్ర ఏంటో తెలుసా? సినిమాలో ఝాన్సీ లక్ష్మీబాయ్ పాత్రలో ఆమె కనిపించనుందట. ఈ మేరకు యూనిట్ కు చెందిన వ్యక్తులే ఫీలర్లు లీక్ చేస్తున్నారు. సినిమాలో ఆమె పాత్ర చాలా కీలకమైనదని, పైగా చనిపోతుందని కూడా చెబుతున్నారు. ఆ ఎపిసోడ్ మొత్తాన్ని చాలా సీక్రెట్ గా చిత్రీకరించారని, రిలీజ్ తర్వాత ప్రచారం కోసం వాటిని వాడుతారని చెబుతున్నారు.

సైరాలో అనుష్క పాత్రపై ఇలా రోజుకో గాసిప్ పుట్టుకొస్తూనే ఉన్నప్పటికీ యూనిట్ మాత్రం పెదవి విప్పడం లేదు. అనుష్క గురించి మాట్లాడ్డం లేదు. ప్రస్తుతం యూనిట్ అంతా టీజర్ పనిమీద బిజీగా ఉంది.

ఈ టీజర్ కు స్వయంగా పవన్ కల్యాణ్, వాయిస్ ఓవర్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈరోజు టీజర్ కు తుదిమెరుగులు దిద్దుతారు. 20వ తేదీన సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తారు. అక్టోబర్ 2న వరల్డ్ వైడ్ థియేటర్లలోకి రానుంది సైరా సినిమా. అప్పటివరకు అనుష్క పాత్రపై సస్పెన్స్ తప్పదు.