యాషెస్ సిరీస్ లో స్మిత్ సరికొత్త రికార్డు

  • ఇంగ్లండ్ పై వరుసగా 7 హాఫ్ సెంచరీల స్మిత్
  • మెడకు గాయమైనా వీరోచిత బ్యాటింగ్

ఏడాది నిషేధం తర్వాత టెస్ట్ క్రికెట్లోకి పునరాగమనం చేసిన ఆస్ట్ర్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ తన గోల్డెన్ ఫామ్ ను కొనసాగిస్తున్నాడు.

ఐసీసీ టెస్ట్ చాంపియన్షిప్ కమ్ 2019 యాషెస్ సిరీస్ లో భాగంగా చిరకాల ప్రత్యర్థి ఇంగ్లండ్ తో జరుగుతున్న ఐదుమ్యాచ్ ల యాషెస్ సిరీస్ మొదటి రెండు టెస్టులు, మూడు ఇన్నింగ్స్ లోనే రెండు సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీతో టాప్ రన్ గెటర్ గా నిలిచాడు.

బర్మింగ్ హామ్ వేదికగా ముగిసిన మొదటి టెస్ట్ రెండుఇన్నింగ్స్ లోనూ సెంచరీలతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచిన స్మిత్… క్రికెట్ మక్కా లార్డ్స్ వేదికగా జరుగుతున్నరెండోటెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో ఫైటింగ్ హాఫ్ సెంచరీ సాధించి.. సెంచరీల హ్యాట్రిక్ కు 8 పరుగుల దూరంలో అవుటయ్యాడు.

స్మిత్ మొత్తం 161 బాల్స్ ఎదుర్కొని 145 బౌండ్రీలతో 92 పరుగుల స్కోరుకు క్రిస్ వోక్స్ బౌలింగ్ లో అవుటయ్యాడు.

యాషెస్ సిరీస్ లో స్టీవ్ స్మిత్ కు ఇది వరుసగా ఏడో హాఫ్ సెంచరీ కావడం ఓ రికార్డు. ఇప్పటి వరకూ యాషెస్ సిరీస్ లో వరుసగా ఆరు హాఫ్ సెంచరీలు సాధించిన మైక్ హస్సీ రికార్డును స్మిత్ అధిగమించగలిగాడు.

ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ ఆర్చర్ బౌలింగ్ లో మెడకు గాయమైనా…కొద్ది నిముషాలపాటు విశ్రాంతి తీసుకొన్న స్మిత్…తిరిగి బ్యాటింగ్ కొనసాగించి 92 పరుగులకు అవుట్ కావడం విశేషం.