Telugu Global
NEWS

సైనికుడుగా ధోనీ బిజీబిజీ

లడాక్ లో ధోనీ సరదాసరదా క్రికెట్ రోమ్ లో రోమన్ లా ఉండు అన్నమాట భారత దిగ్గజ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోనీకి అతికినట్లు సరిపోతుంది. భారత ప్రాదేశిక దళాలకు చెందిన ప్యారాచూట్ వింగ్ లో గౌరవ్ లెఫ్ట్ నెంట్ కర్నల్ హోదాలో విధులు నిర్వర్తిస్తున్న ధోనీ..అప్పుడే రెండువారాలు పూర్తి చేశాడు. సైనికదళంలో సైనికుడుగా కలసిపోయి మరీ తన బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. క్రమశిక్షణ కలిగిన సైనికుడుగా ధోనీ కాశ్మీర్ లోయలో గస్తీ విధులు పూర్తి చేసి… లడాక్ లోని లే నగరానికి […]

సైనికుడుగా ధోనీ బిజీబిజీ
X
  • లడాక్ లో ధోనీ సరదాసరదా క్రికెట్

రోమ్ లో రోమన్ లా ఉండు అన్నమాట భారత దిగ్గజ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోనీకి అతికినట్లు సరిపోతుంది. భారత ప్రాదేశిక దళాలకు చెందిన ప్యారాచూట్ వింగ్ లో గౌరవ్ లెఫ్ట్ నెంట్ కర్నల్ హోదాలో విధులు నిర్వర్తిస్తున్న ధోనీ..అప్పుడే రెండువారాలు పూర్తి చేశాడు.

సైనికదళంలో సైనికుడుగా కలసిపోయి మరీ తన బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. క్రమశిక్షణ కలిగిన సైనికుడుగా ధోనీ కాశ్మీర్ లోయలో గస్తీ విధులు పూర్తి చేసి… లడాక్ లోని లే నగరానికి చేరుకొన్నాడు.

శ్రీనగర్ నుంచి లడాక్ చేరిన సమయంలో ధోనీకి అక్కడి సైనికదళాలు ఘనస్వాగతం పలికాయి. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో భాగంగా నిర్వహించిన జెండా వందనం కార్యక్రమంలో ధోనీ పాల్గొన్నాడు.

అంతేకాదు…సైనికదళ సభ్యులతో కలసి వాలీబాల్ ఆడిన ఫోటోను ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకొన్నాడు. లే నగరంలోని ఓ బాస్కెట్ బాల్ కోర్టును.. క్రికెట్ ఫీల్డ్ గా మార్చి అక్కడి పిల్లలతో కలసి ధోనీ క్రికెట్ ఆడాడు.

సైనికదళంలో రెండుమాసాల సేవ అనంతరం ధోనీ తిరిగి క్రికెట్ ఫీల్డ్ లోకి అడుగుపెట్టనున్నాడు. సెప్టెంబర్ 15 నుంచి సౌతాఫ్రికాతో జరిగే టీ-20 సిరీస్ లో.. మహేంద్ర సింగ్ ధోనీ తిరిగి పాల్గొనే అవకాశం ఉంది.

ఇంగ్లండ్ లో ముగిసిన వన్డే ప్రపంచకప్ తర్వాత..సైనిక విధుల్లో చేరిన ధోనీ వచ్చే ఏడాది జరిగే టీ-20 ప్రపంచకప్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉంది.

First Published:  17 Aug 2019 8:15 PM GMT
Next Story