రాంచరణ్, పవన్ పై శ్రీరెడ్డి హాట్ కామెంట్స్

శ్రీరెడ్డి. వివాదాస్పద నటి. టాలీవుడ్ లోని కాస్టింగ్ కౌచ్ ను బయటపెట్టి సంచలనం సృష్టించిన ఈమె… నగ్నంగా మా అసోసియేషన్ ముందు నిలబడి దేశవ్యాప్తంగా దుమారం రేపింది. ఈమె దెబ్బకు.. ఈమె చేసిన లీక్స్ కు టాలీవుడ్ మొత్తం షేక్ అయ్యింది.

అయితే ఈ మధ్య చెన్నైకి మకాం మార్చి అక్కడ పలు సినిమాల్లో నటిస్తున్న శ్రీరెడ్డి టాలీవుడ్ పై కాసింత ఫోకస్ తగ్గించింది. అయితే తాజాగా పవన్ చేసిన హాట్ కామెంట్స్ పై శ్రీరెడ్డి కౌంటర్ ఇచ్చింది.

ఇటీవల పవన్.. తన పార్టీ జనసేనను విలీనం చేయాలని ఒక పెద్ద పార్టీ ఒత్తిడి తెస్తోందంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలకు కౌంటర్ గా శ్రీరెడ్డి హాట్ కామెంట్ చేసింది. ‘జనసేన ఒక విషపు చుక్క. ఇది ఎంత పెద్ద ద్రావణం (బీజేపీ)లో వేసినా అది ఆ ద్రావణాన్ని పాడు చేస్తుంది.. మీరు మాకొద్దు.. మీ పార్టీ వద్దు’ అంటూ శ్రీరెడ్డి కౌంటర్ ఇచ్చింది.

ఇక బాబాయ్ పవన్ పై దుమ్మెత్తిపోసిన శ్రీరెడ్డి అదే సమయంలో అబ్బాయి రాంచరణ్ ను మాత్రం ఆకాశానికెత్తేసింది. ఇటీవల ప్రకటించిన జాతీయ , ప్రాంతీయ అవార్డుల్లో రంగస్థలంలో నటనకు ఉత్తమ నటుడి అవార్డ్ పొందిన రాంచరణ్ కు అభినందలు తెలిపింది.