మహేష్ సినిమాలో విజయశాంతి పాత్ర ఇదే!

13 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తోంది. గడిచిన నాలుగేళ్లుగా ఎన్నో కథలు విని రిజెస్ట్ చేసింది. అలాంటిది సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటించడానికి ఒప్పుకుందంటే.. ఆ సినిమాలో విజయశాంతి పోషిస్తున్న పాత్ర ఎంతో ప్రత్యేకమైనదై ఉంటుందని అంతా భావిస్తున్నారు. అది నిజం కూడా. దర్శకుడు అనీల్ రావిపూడి ఈమె పాత్రను ఎంతో ప్రత్యేకంగా తీర్చిదిద్దాడు. ఇప్పుడా పాత్రకు సంబంధించిన షేడ్స్ మెల్లమెల్లగా రివీల్ అవుతున్నాయి.

సరిలేరు నీకెవ్వరు సినిమాలో మెడికల్ ప్రొఫెసర్ గా కనిపించనుందట విజయశాంతి. సినిమాలో ఆమె ఎంట్రీ కూడా చాలా ఇంటెన్స్ గా ఉంటుందని చెబుతున్నారు. అయితే ఆమె కేవలం మెడికల్ ప్రొఫెసర్ పాత్రకే పరిమితం అవ్వదని, సినిమాలో ఆమెకు చాలా షేడ్స్ ఉంటాయని చెబుతున్నారు. ఆ షేడ్స్ కు, ఆర్మీ ఆఫీసర్ గా నటిస్తున్న మహేష్ బాబుకు సంబంధం ఏంటో తెలియాలంటే సినిమా రిలీజ్ వరకు ఆగాల్సిందే.

మరోవైపు ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే అన్నపూర్ణ స్టుడియోస్ లో వేసిన ఓ ట్రయిన్ సెట్ లో షెడ్యూల్ పూర్తిచేశారు. తర్వాత విజయశాంతిపై కూడా కొన్ని సన్నివేశాలు తెరకెక్కించారు. రేపట్నుంచి రామోజీఫిలింసిటీలో ఈ సినిమాకు సంబంధించి కొత్త షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. ఫిలింసిటీలో ఈ సినిమా కోసం కర్నూల్ కు చెందిన కొండారెడ్డి బురుజు సెట్ ను వేశారు. మహేష్, రష్మిక ఈ షెడ్యూల్ లో పాల్గొంటారు