Telugu Global
NEWS

11 ఏళ్ల కొహ్లీ కెరియర్ లో విరాట్ స్వరూపం

2008 ఆగస్టు 18న కొహ్లీ తొలి అంతర్జాతీయ మ్యాచ్  20 వేల పరుగులు, 67 శతకాలు జీవనయానంలో మాత్రమే కాదు… క్రికెట్ ప్రయాణంలోనూ… ఎంత సుదూర ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుంది. దానికి ప్రపంచ నంబర్ వన్ బ్యాట్స్ మన్, భారత కెప్టెన్ విరాట్ కొహ్లీ సైతం ఏమాత్రం మినహాయింపు కాదు. పదకొండు సంవత్సరాల క్రితం… ఇదేరోజున 19 ఏళ్ల వయసులో తన తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన విరాట్ కొహ్లీ.. గత దశాబ్దకాలంలో అంతైఇంతై అంతింతై అన్నట్లుగా ఎదిగిపోయాడు. […]

11 ఏళ్ల కొహ్లీ కెరియర్ లో విరాట్ స్వరూపం
X
  • 2008 ఆగస్టు 18న కొహ్లీ తొలి అంతర్జాతీయ మ్యాచ్
  • 20 వేల పరుగులు, 67 శతకాలు

జీవనయానంలో మాత్రమే కాదు… క్రికెట్ ప్రయాణంలోనూ… ఎంత సుదూర ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుంది. దానికి ప్రపంచ నంబర్ వన్ బ్యాట్స్ మన్, భారత కెప్టెన్ విరాట్ కొహ్లీ సైతం ఏమాత్రం మినహాయింపు కాదు.

పదకొండు సంవత్సరాల క్రితం… ఇదేరోజున 19 ఏళ్ల వయసులో తన తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన విరాట్ కొహ్లీ.. గత దశాబ్దకాలంలో అంతైఇంతై అంతింతై అన్నట్లుగా ఎదిగిపోయాడు.

శ్రీలంక ప్రత్యర్థిగా వన్డే అరంగేట్రం…

2008 ఆగస్టు 18న శ్రీలంక ప్రత్యర్థిగా వన్డే అరంగేట్రం చేసిన విరాట్ కొహ్లీ… భారత ఓపెనర్ గా తన కెరియర్ మొదలు పెట్టి… మొట్టమొదటి ఇన్నింగ్స్ లో కేవలం 12 పరుగులు మాత్రమే చేయగలిగాడు.

ఆ మరుసటి ఏడాదే వన్డే క్రికెట్లో తన తొలి సెంచరీ సాధించిన విరాట్ కొహ్లీ ఆ తరువాత వెనుదిరిగి చూసింది లేదు. గత దశాబ్దకాలంలో…ప్రస్తుత విండీస్ సిరీస్ వరకూ 239 వన్డే మ్యాచ్ లు ఆడిన కొహ్లీ 43 సెంచరీలతో 11వేల 520 పరుగులు సాధించాడు.

అత్యంత వేగంగా 10వేలు, 20వేల పరుగుల మైలురాళ్లు చేరిన తొలి క్రికెటర్ గా నిలిచాడు.

77 టెస్టుమ్యాచ్ ల్లో 6వేల 613 పరుగులు, 70 టీ-20 మ్యాచ్ ల్లో 2వేల 369 పరుగులు సాధించిన ఘనత విరాట్ కొహ్లీకి ఉంది.

అంతర్జాతీయ క్రికెట్లో ప్రస్తుతం వన్డే, టెస్ట్ క్రికెట్ ఫార్మాట్లలో ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ ప్లేయర్ గా విరాట్ కొహ్లీ కొనసాగుతున్నాడు.

వన్డే క్రికెట్లో మరో ఏడు శతకాలు బాదగలిగితే…మాస్టర్ సచిన్ పేరుతో ఉన్న 49 సెంచరీల ప్రపంచ రికార్డును అధిగమించగలుగుతాడు.

ఇప్పటికే డజనుకు పైగా రికార్డులు నెలకొల్పిన విరాట్ కొహ్లీ రానున్న కాలంలో మరెన్ని ప్రపంచ రికార్డులు సాధించగలడన్నదే ఇక్కడి అసలు పాయింట్..

First Published:  18 Aug 2019 8:17 AM GMT
Next Story