Telugu Global
NEWS

నేటినుంచే ప్రపంచ బ్యాడ్మింటన్ సమరం

బంగారు వేటకు సింధు,సైనా రెడీ బాసెల్ వేదికగా ఆగస్టు 25 వరకూ టోర్నీ ప్రపంచ బ్యాడ్మింటన్లో అతిపెద్ద సమరం…2019 ప్రపంచ బ్యాడ్మింటన్ టోర్నీకి స్విట్జర్లాండ్ లోని బాసెల్ లో రంగం సిద్ధమయింది. మరికొద్ది గంటల్లో ప్రారంభమయ్యే ఈ ప్రపంచ సమరంలో వివిధ దేశాలకు చెందిన అగ్రశ్రేణి ప్లేయర్లంతా పురుషుల, మహిళల సింగిల్స్, డబుల్స్ విభాగాలలో తమ అదృష్టం పరీక్షించుకోనున్నారు. మహిళల సింగిల్స్ లో ఇప్పటికే రజత పతకాలు సాధించిన భారత స్టార్లు సైనా నెహ్వాల్, పీవీ సింధు మాత్రం…ప్రస్తుత […]

నేటినుంచే ప్రపంచ బ్యాడ్మింటన్ సమరం
X
  • బంగారు వేటకు సింధు,సైనా రెడీ
  • బాసెల్ వేదికగా ఆగస్టు 25 వరకూ టోర్నీ

ప్రపంచ బ్యాడ్మింటన్లో అతిపెద్ద సమరం…2019 ప్రపంచ బ్యాడ్మింటన్ టోర్నీకి స్విట్జర్లాండ్ లోని బాసెల్ లో రంగం సిద్ధమయింది. మరికొద్ది గంటల్లో ప్రారంభమయ్యే ఈ ప్రపంచ సమరంలో వివిధ దేశాలకు చెందిన అగ్రశ్రేణి ప్లేయర్లంతా పురుషుల, మహిళల సింగిల్స్, డబుల్స్ విభాగాలలో తమ అదృష్టం పరీక్షించుకోనున్నారు.

మహిళల సింగిల్స్ లో ఇప్పటికే రజత పతకాలు సాధించిన భారత స్టార్లు సైనా నెహ్వాల్, పీవీ సింధు మాత్రం…ప్రస్తుత టోర్నీలో బంగారు పతకానికే గురిపెట్టారు.

సింధు 5వ సీడ్ గా, సైనా 8వ సీడ్ గా బరిలోకి దిగుతున్నారు. 24 సంవత్సరాల సింధుకు ప్రపంచ బ్యాడ్మింటన్ లో ఒక్కో రజత, కాంస్య పతకాలు సాధించిన రికార్డు ఉంది.

మరోవైపు సైనా ఒక్కసారి మాత్రమే సిల్వర్ క్వీన్ గా నిలిచింది. 2017 ఫైనల్లో ఒకుహర చేతిలో ఓడి రజతం సాధించిన సింధు.. 2018లో కారోలినా మారిన్ చేతిలో కంగుతిని కాంస్య పతకంతో సంతృప్తి చెందాల్సి వచ్చింది.

డ్రా ప్రకారం ప్రస్తుత టోర్నీ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నంబర్ వన్, తైవాన్ ప్లేయర్ తాయ్ జు యింగ్, సెమీఫైనల్లో సైనా నెహ్వాల్ లతో సింధు తలపడాల్సి ఉంది.

మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో చైనా స్టార్ ప్లేయర్ చెన్ యూ ఫే తో సైనా అమీతుమీ తేల్చుకోవాల్సి ఉంది.

పురుషుల సింగిల్స్ లో కిడాంబీ శ్రీకాంత్, సాయి ప్రణీత్, సమీర్ వర్మ, మహిళల డబుల్స్ లో సిక్కీ రెడ్డి- అశ్వనీ పొన్నప్ప తమ అదృష్టం పరీక్షించుకోబోతున్నారు.

First Published:  18 Aug 2019 8:10 PM GMT
Next Story