Telugu Global
Cinema & Entertainment

40 కోట్ల క్లబ్ లో చేరిన రామ్

తెలుగులో ఓ సినిమాకు 40 కోట్ల రూపాయల షేర్ అంటే మామూలు విషయం కాదు. మహేష్, ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి హీరోలకు మాత్రమే సాధ్యమైన ఫీట్ అది. గీతగోవిందం సినిమాతో విజయ్ దేవరకొండ మాత్రం ఈ ఘనత సాధించాడు. ఇతడు మినహా మిగతా మీడియం రేంజ్ లో ఉన్న హీరోలెవరూ ఇప్పటివరకు ఈ మార్క్ అందుకోలేకపోయారు. చివరికి ఇంత మార్కెట్ ఉన్న నాని వల్ల కూడా కాలేదు. ఇప్పుడీ సెగ్మెంట్ నుంచి మరో […]

40 కోట్ల క్లబ్ లో చేరిన రామ్
X

తెలుగులో ఓ సినిమాకు 40 కోట్ల రూపాయల షేర్ అంటే మామూలు విషయం కాదు. మహేష్, ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి హీరోలకు మాత్రమే సాధ్యమైన ఫీట్ అది.

గీతగోవిందం సినిమాతో విజయ్ దేవరకొండ మాత్రం ఈ ఘనత సాధించాడు. ఇతడు మినహా మిగతా మీడియం రేంజ్ లో ఉన్న హీరోలెవరూ ఇప్పటివరకు ఈ మార్క్ అందుకోలేకపోయారు. చివరికి ఇంత మార్కెట్ ఉన్న నాని వల్ల కూడా కాలేదు. ఇప్పుడీ సెగ్మెంట్ నుంచి మరో హీరో ఈ క్లబ్ లోకి చేరాడు. అతడే రామ్ పోతినేని. అవును.. ఇతడు నటించిన ఇస్మార్ట్ శంకర్ సినిమా తాజాగా 40 కోట్ల క్లబ్ లో చేరింది.

నిన్నటితో 32 రోజుల రన్ పూర్తిచేసుకున్న ఈ సినిమా తాజా వసూళ్లతో కలుపుకొని 40 కోట్ల 5 లక్షల రూపాయల షేర్ సాధించింది. రామ్ కెరీర్ లోనే ఇది అత్యధికం. అలా తను ఎప్పట్నుంచో కలలుకంటున్న 40 కోట్ల షేర్ క్లబ్ లోకి ప్రవేశించాడు ఈ హీరో. ఇక గ్రాస్ పరంగా చూసుకుంటే.. ఈ సినిమాకు ఇప్పటివరకు 82 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది.

వరల్డ్ వైడ్ ఈ సినిమాను 21 కోట్ల రూపాయలకు అమ్మారు. తాజా వసూళ్లతో డిస్ట్రిబ్యూటర్లకు రెట్టింపు లాభాలు వచ్చినట్టయింది. మరోవైపు ఓవర్ ఫ్లోస్ కారణంగా నిర్మాతలు పూరి, చార్మికి కూడా బాగానే డబ్బులు గిట్టుబాటు అవుతున్నాయి.

First Published:  19 Aug 2019 8:00 AM GMT
Next Story