‘మైదాన్’ లో… మహానటి

ప్రస్తుతం అజయ్ దేవగన్ తదుపరి సినిమా కి టైటిల్ ఖరారు చేశారు. ఈ సినిమా తో కీర్తి సురేష్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది.

ఎప్పటి నుంచో ఈ సినిమా కి సంబంధించిన వార్తలు వినిపిస్తున్నాయి…. కానీ ఎట్టకేలకు ఈ సినిమా గురించిన అధికారిక ప్రకటన వెలువడింది.

ఈ రోజే ఈ సినిమా కి సంబంధించిన ప్రకటన వెలువడింది. ఇందులోనే కీర్తి సురేష్ కు సంబంధించిన ఒక ప్రకటన కూడా వచ్చింది.

అయితే ఆసక్తికర అంశం ఏంటి అంటే ఈ సినిమా మొత్తం ఫుట్ బాల్ బ్యాక్ డ్రాప్ లో నడుస్తుంది. ఈ సినిమాకి ఒక టైటిల్ ని కూడా ఖరారు చేశారు. ఈ సినిమా పేరు ‘మైదాన్’. భారత దేశం లో ఫుట్ బాల్ ఒక వెలుగు వెలిగిన రోజులను ఈ సినిమాలో చూపించబోతున్నారట.

‘బదాయి హో’ అనే చిత్రం తో అందరినీ మెప్పించిన అమిత్ శర్మ ఈ సినిమా కి దర్శకుడు. ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలో తెలుస్తాయి.