ఒక్క హిట్ తో…. రెండు సినిమాలు…. 

సుధీర్ బాబు హీరోగా నటించిన ‘నన్ను దోచుకుందువటే’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కర్ణాటక బ్యూటీ నభ నటేష్ ఈ మధ్యనే ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా తో మంచి హిట్ ను అందుకుంది.

రామ్ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా మారింది. దీంతో నభా నటేష్ పాపులారిటీ ఉన్నట్టుండి పెరిగిపోయింది.

తాజాగా ఈమె రవితేజ హీరోగా నటిస్తున్న ‘డిస్కో రాజా’ సినిమాలో హీరోయిన్ గా కనిపించనుంది. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ ఫేమ్ విఐ ఆనంద్ ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నారు.

ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన తదుపరి సినిమా గురించి క్లారిటీ ఇచ్చింది నభ నటేష్. తను ఇప్పటికే కొన్ని కథలను వింటున్నానని వాటిల్లో రెండు కథలు బాగా నచ్చాయని ఇంకా సినిమాకి సంబంధించిన డిస్కషన్స్ జరుగుతున్నాయని చెప్పుకొచ్చింది ఈ భామ.

‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా సక్సెస్ నభ నటేష్ కి కావలసినంత ఇమేజ్ ని తెచ్చి పెట్టింది. మరి తన తదుపరి సినిమాతో ఆ స్టార్ డమ్ ని నిలబెట్టుకోగలుగుతుందో లేదో వేచి చూడాలి. ఇక తన సినిమాల గురించి అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది.