మందు కొట్టిన సాహో హీరోయిన్

వ్యక్తిగత విషయాల్ని పబ్లిక్ గా షేర్ చేసుకోవడానికి హీరోయిన్లు పెద్దగా ఇష్టపడరు. కానీ బాలీవుడ్ హీరోయిన్లు మాత్రం ఈ విషయంలో ఏమాత్రం తగ్గరు. పలు టాక్ షోల్లో తమ సెక్స్ అనుభవాల్ని కూడా పంచుకున్న హీరోయిన్లు ఉన్నారు. శృంగారంలో తమకు ఎలాంటి భంగిమలు ఇష్టమో కూడా బయటపెట్టిన హీరోయిన్లు ఉన్నారు. మరీ ఇంత బోల్డ్ గా కాకపోయినా.. తన మందు అనుభవాల్ని బయటపెట్టింది సాహో హీరోయిన్ శ్రద్ధాకపూర్.

జీవితంలో మొదటిసారి మందుకొట్టి తన తల్లికి అడ్డంగా బుక్ అయిపోయిందట శ్రద్ధాకపూర్. ఎలా ఉంటుందో చూద్దామని ఓరోజు రాత్రి మందు తాగిందట శ్రద్ధ. అలాగే ఇంటికెళ్లి తల్లి ముందు అడ్డదిడ్డంగా ప్రవర్తించిందట. గట్టిగా నవ్వడం, ఊగిపోవడం చేసిందట. ఈ ప్రవర్తన మొత్తాన్ని తన తల్లి మౌనంగా భరించిందని, మరుసటి రోజు ఉదయం తన తల్లి మొహం చూడలేకపోయానని చెప్పుకొచ్చింది శ్రద్ధాకపూర్.

సాహో సినిమా ప్రమోషన్ లో భాగంగా ఇలా తన తొలి పెగ్ అనుభవాల్ని ప్రేక్షకులతో పంచుకుంది శ్రద్ధాకపూర్. ఓ తమిళ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని బయటపెట్టింది. దీంతోపాటు మరిన్ని వ్యక్తిగత ప్రశ్నలు ఎదురైనప్పటికీ.. వాటికి సమాధానాలు చెప్పడానికి పెద్దగా ఇష్టపడలేదు ఈ బ్యూటీ.