Telugu Global
NEWS

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవం

తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవం అయ్యాయి. తెలంగాణలో ఒక స్థానానికి, ఆంధ్రప్రదేశ్ లో మూడు ఎమ్మెల్సీ స్ధానాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఎన్నికలలో తెలంగాణలోను, ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర్ర సమతి, వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులు మాత్రమే పోటీ చేశారు. ఈ రెండు రాష్ట్ర్రాలలోనూ ప్రతిపక్ష పార్టీలకు శాసనసభల్లో తగినంత బలం లేకపోవడంతో ఆ పార్టీల నుంచి ఎవ్వరూ ఎమ్మెల్యే కోటాలో జరిగిన […]

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవం
X

తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవం అయ్యాయి. తెలంగాణలో ఒక స్థానానికి, ఆంధ్రప్రదేశ్ లో మూడు ఎమ్మెల్సీ స్ధానాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది.

ఈ ఎన్నికలలో తెలంగాణలోను, ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర్ర సమతి, వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులు మాత్రమే పోటీ చేశారు. ఈ రెండు రాష్ట్ర్రాలలోనూ ప్రతిపక్ష పార్టీలకు శాసనసభల్లో తగినంత బలం లేకపోవడంతో ఆ పార్టీల నుంచి ఎవ్వరూ ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో నామినేషన్లు కూడా వేయలేదు.

దీంతో నామినేషన్ల దాఖలు చేసేందుకు సోమవారం గడువు కావడం, తెలంగాణలో అధికార పార్టీ నుంచి ఒక్కరు, ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ తరఫున ముగ్గురు నామినేషన్లు దాఖలు చేశారు.

తెలంగాణలో ఎమ్మెల్సీ బరిలో నిలిచిన మాజీ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రకటించారు.

సోమవారం సాయంత్రం గుత్తా సుఖేందర్ రెడ్డికి ఎమ్మెల్సీగా ఎన్నికైనట్లుగా ధ్రవీకరణ పత్రాన్ని అందజేశారు. మాజీ ఎంపీ అయిన గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రజాప్రతినిధిగా ఎన్నిక కావడంతో ఆయనకు తెలంగాణ మంత్రివర్గంలో ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు స్థానం కల్పించే అవకాశం ఉందంటున్నారు.

ఇక ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీకి చెందిన ముగ్గురు అభ్యర్ధులు ఎమ్మెల్సీలుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక్కడ కూడా అధికార పార్టీ నుంచి మాత్రమే ముగ్గురు అభ్యర్ధులు ఎన్నికల బరిలో నిలవడంతో వారు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. ఎన్నికైన వారికి ధ్రవీకరణ పత్రాలు అందజేశారు.

ఇలా ఎమ్మెల్సీలుగా ఎన్నికైన వారిలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో సభ్యుడైన మోపిదేవి వెంకటరమణ, వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ నాయకులు ఇక్బాల్, చల్లా రామక్రిష్ణారెడ్డి ఉన్నారు. శాసనసభ ఎన్నికలకు ముందు కొన్ని సమీకరణాల్లో భాగంగా చల్లా రామక్రిష్ణారెడ్డికి టిక్కెట్ ఇవ్వలేకపోయారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఆ సమయంలో ఎమ్మెల్సీ పదవి ఇస్తానని హామీ ఇచ్చారు. ఆయనకు ఇచ్చిన హామీ మేరకు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలుగా నియమించారు.

ఇక మరో ఎమ్మెల్సీ మోపిదేవి వెంకట రమణ శాసనసభ ఎన్నికలలో ఓటమి పాలయ్యారు. అయితే ఆయనతో జగన్మోహన్ రెడ్డికి ఉన్న సాన్నిహిత్యం రీత్యా ఓటమి పాలైనా మోపిదేవికి మంత్రి పదవి ఇచ్చారు సీఎం జగన్. ఆ తర్వాత తాజా ఎమ్మెల్సీ ఎన్నికలలో మోపిదేవికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మాట తప్పనని మరోసారి నిరూపించుకున్నారు.

First Published:  19 Aug 2019 11:35 AM GMT
Next Story