నాగ్ అశ్విన్ తో… విజయ్ దేవరకొండ

అప్పటిదాకా చిన్న చిన్న పాత్రలు పోషిస్తున్న విజయ్ దేవరకొండకి ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమాలో కీలక పాత్ర ఇచ్చాడు దర్శకుడు నాగ్ అశ్విన్. ఈ మధ్యనే అలనాటి తార సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘మహానటి’ సినిమాలో సైతం విజయ్ దేవరకొండ ఒక ముఖ్య పాత్ర పోషించారు.

అయితే తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు నాగ్ అశ్విన్ దర్శకత్వం లో విజయ్ దేవరకొండ హీరో గా మారబోతున్నాడన్న వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ కలిసి వైజయంతి క్రియేషన్స్ పతాకంపై ఒక సినిమా చేయబోతున్నట్లు గా ఇండస్ట్రీ వర్గాలు గుసాగుసలాడుతున్నాయి.

ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారని తెలుస్తోంది. అంతేకాకుండా ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఒక కష్టమైన పాత్ర పోషించనున్నాడని తెలుస్తుంది. అయితే అది ఎలాంటి పాత్ర అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.

ఈ మధ్యనే ‘డియర్ కామ్రేడ్’ సినిమాతో అనుకున్నంత విజయం అందుకోలేకపోయిన విజయ్ దేవరకొండ… ప్రస్తుతం ‘హీరో’ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో చేయబోయే సినిమా షూటింగ్ మొదలు పెట్టనున్నాడు విజయ్. ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన ఈ నెలాఖరులో విడుదల కాబోతోంది.