ఎల్లో మీడియా ఇప్పుడు రివర్స్ గేర్‌ వేసింది

వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ఇవాళ ఎల్లో మీడియాపై సెటైర్ వేశారు. చంద్రబాబుకు కొమ్ము కాసే ఎల్లో మీడియా ఇప్పుడు రివర్స్ గేర్ వేయక తప్పలేదని ట్వీట్ చేశారు.

చంద్రబాబు బీజేపీని వదిలి వెళ్లిన తర్వాత ఆ పార్టీని ఒక పెద్ద విలన్‌గా చిత్రీకరించింది ఎల్లోమీడియా. మొన్నటి వరకు మోడీని రాష్ట్రానికి పెద్ద శత్రువుగా ముద్ర వేసింది. కాని ఇప్పుడు టీడీపీ నాయకులంతా బీజేపీలోకి దూకుతుండటంతో ఎల్లో మీడియాకు పెద్ద చిక్కే వచ్చి పడిందని అన్నారు. ప్రస్తుతం ఎల్లో మీడియా రివర్స్ గేర్ వేయక తప్పడం లేదని ట్వీట్ చేశారు.

మొన్నటి వరకు మోడీకి వ్యతిరేకంగా, చంద్రబాబుకు అనుకూలంగా ఉన్న ఎల్లో మీడియా.. ఇప్పుడు బీజేపీని కూడా మోయక తప్పడం లేదని విజయసాయి రెడ్డి అంటున్నారు.