Telugu Global
NEWS

విరాట్ కొహ్లీకి అరుదైన గౌరవం

ఫిరోజ్ షా కోట్లాలో విరాట్ కొహ్లీ స్టాండ్ భారత కెప్టెన్, ప్రపంచ టాప్ ర్యాంక్ బ్యాట్స్ మన్ విరాట్ కొహ్లీకి కేవలం మూడుపదుల వయసులోనే ఓ అరుదైన గౌరవం దక్కింది. న్యూఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా స్టేడియంలో కొహ్లీ పేరుతో ఓ స్టాండ్ ను ఏర్పాటు చేయాలని ఢిల్లీ అండ్ డిస్ట్ర్రిక్ట్ క్రికెట్ సంఘం నిర్ణయించింది. ఢిల్లీ క్రికెటర్ గా తమకు అతిచిన్న వయసులోనే అంతర్జాతీయ గుర్తింపుతో పాటు గౌరవాన్నితెచ్చిన విరాట్ కొహ్లీ పేరుతో ఓ స్టాండ్ ను […]

విరాట్ కొహ్లీకి అరుదైన గౌరవం
X
  • ఫిరోజ్ షా కోట్లాలో విరాట్ కొహ్లీ స్టాండ్

భారత కెప్టెన్, ప్రపంచ టాప్ ర్యాంక్ బ్యాట్స్ మన్ విరాట్ కొహ్లీకి కేవలం మూడుపదుల వయసులోనే ఓ అరుదైన గౌరవం దక్కింది. న్యూఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా స్టేడియంలో కొహ్లీ పేరుతో ఓ స్టాండ్ ను ఏర్పాటు చేయాలని ఢిల్లీ అండ్ డిస్ట్ర్రిక్ట్ క్రికెట్ సంఘం నిర్ణయించింది.

ఢిల్లీ క్రికెటర్ గా తమకు అతిచిన్న వయసులోనే అంతర్జాతీయ గుర్తింపుతో పాటు గౌరవాన్నితెచ్చిన విరాట్ కొహ్లీ పేరుతో ఓ స్టాండ్ ను ఏర్పాటు చేయడం ద్వారా గౌరవించాలని నిర్ణయించినట్లు ఢిల్లీ క్రికెట్ సంఘం అధ్యక్షుడు రజత్ శర్మ ప్రకటించారు.

దేశరాజధాని ఢిల్లీ క్రికెట్ కు చిరునామాగా నిలిచే ఫిరోజ్ షా స్టేడియంలో ఇప్పటికే భారత మాజీ క్రికెటర్లు బిషిన్ సింగ్ బేడీ, మొహిందర్ అమర్ నాథ్ ల పేర్లతో స్టాండ్ లు ఏర్పాటు చేశారు. ఈ ఇద్దరు దిగ్గజ క్రికెటర్ల రిటైర్మెంట్ తర్వాతే..స్టేడియంలోని స్టాండ్ లకు పేర్లు పెట్టి ఢిల్లీ క్రికెట్ సంఘం గౌరవించింది.

అయితే…కొహ్లీ కేవలం 11 ఏళ్ల క్రికెట్ కెరియర్ లోనే ఈ గౌరవాన్నిపొందటం విశేషం.

వీరూ, అంజుమ్ ల పేర్లతో గేట్లు…

భారత మాజీ కెప్టెన్ మన్సూర్ అలీఖాన్ పటౌడీకి హాల్ ఆఫ్ ఫేమ్ గౌరవాన్ని ఇచ్చిన ఢిల్లీ క్రికెట్ సంఘం…మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్, భారత మహిళా క్రికెట్ మాజీ కెప్టెన్ అంజుమ్ చోప్రాల పేర్లతో గేట్లను సైతం ఏర్పాటు చేసి గౌరవించింది.

ముంబైలోని వాంఖెడీ స్టేడియంలో సచిన్ టెండుల్కర్, సునీల్ గవాస్కర్ ల పేర్లతో స్టాండ్లు, హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో శివలాల్ యాదవ్, వీవీఎస్ లక్ష్మణ్ , డాక్టర్ ఎమ్వీ శ్రీధర్ ల పేర్లతో స్టాండ్లు, గేట్లు ఏర్పాటు చేశారు.

First Published:  18 Aug 2019 11:48 PM GMT
Next Story