Telugu Global
NEWS

సోషల్ మీడియాలోనూ కింగ్ విరాట్ కొహ్లీ

కొహ్లీ తర్వాతి స్థానాలలో సచిన్, ధోనీ క్రికెట్ ఫీల్డ్, యాడ్ మార్కెట్లలో రికార్డుల మోత మోగిస్తున్న విరాట్ కొహ్లీ…సోషల్ మీడియాలో సైతం నంబర్ వన్ క్రికెటర్ గా నిలిచాడు. సోషల్ మీడియాను సైతం లాభసాటి వ్యాపారంగా మలచుకొన్న కొహ్లీకి మొత్తం 9 కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇందులో ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ వేదికలు సైతం ఉన్నాయి. ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్ ఫ్లాట్ ఫామ్ ల్లో 3 కోట్ల మంది చొప్పున […]

సోషల్ మీడియాలోనూ కింగ్ విరాట్ కొహ్లీ
X
  • కొహ్లీ తర్వాతి స్థానాలలో సచిన్, ధోనీ

క్రికెట్ ఫీల్డ్, యాడ్ మార్కెట్లలో రికార్డుల మోత మోగిస్తున్న విరాట్ కొహ్లీ…సోషల్ మీడియాలో సైతం నంబర్ వన్ క్రికెటర్ గా నిలిచాడు.

సోషల్ మీడియాను సైతం లాభసాటి వ్యాపారంగా మలచుకొన్న కొహ్లీకి మొత్తం 9 కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు.
ఇందులో ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ వేదికలు సైతం ఉన్నాయి.

ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్ ఫ్లాట్ ఫామ్ ల్లో 3 కోట్ల మంది చొప్పున విరాట్ కొహ్లీని ఫాలోఅవుతున్నారు.

రెండోస్థానంలో సచిన్…

సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న క్రికెటర్లలో కొహ్లీ తర్వాతి స్థానంలో..మాస్టర్ సచిన్ టెండుల్కర్ నిలిచాడు. ట్విట్టర్ లో 3 కోట్ల 10 లక్షలు, ఫేస్ బుక్ లో 2 కోట్ల 80 లక్షలు, ఇన్ స్టాగ్రామ్ లో కోటీ 65 లక్షల మంది మాస్టర్ ను ఫాలో అవుతున్నారు.

ఇక…భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఫేస్ బుక్ లో 2 కోట్ల 50 లక్షలు, ట్విట్టర్లో 77 లక్షల మంది, ఇన్ స్టాగ్రామ్ లో కోటీ 54 లక్షలమంది ఫాలోవర్స్ ఉన్నారు.

సోషల్ మీడియాలో చురుకుగా ఉండే భారత వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ నాలుగు, సురేశ్ రైనా ఐదు స్థానాలలో కొనసాగుతున్నారు.

యువరాజ్ సింగ్ ఆరు, హర్భజన్ సింగ్ ఏడు, సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డివిలియర్స్ ఎనిమిది, శిఖర్ ధావన్ తొమ్మిది, కరీబియన్ సునామీ ఓపెనర్ క్రిస్ గేల్ పది స్థానాలలో కొనసాగుతున్నారు.

ఎండార్స్ మెంట్ల ద్వారా కోట్ల రూపాయలు ఆర్జిస్తున్న కొహ్లీ…సోషల్ మీడియాలో తనకున్న ఆదరణను సైతం పూర్తిస్థాయిలో సొమ్ము చేసుకొంటూ.. అదనపు సొమ్ము సంపాదిస్తున్నాడు.

First Published:  18 Aug 2019 8:46 PM GMT
Next Story