తెలుగులో పవన్ కళ్యాణ్… కన్నడలో యష్…

మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కనున్న ‘సై రా నరసింహారెడ్డి’ సినిమా పై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే.

సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. తాజాగా ఈ చిత్ర మేకింగ్ వీడియోని విడుదల చేశారు దర్శక నిర్మాతలు.

వరల్డ్ ఆఫ్ సై రా అనే టైటిల్ తో విడుదల అయిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక తాజాగా ఈ చిత్రం టీజర్ ను విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు. అయితే ఈ టీజర్ కి వాయిస్ ఓవర్ ఇవ్వడం కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. సైరా సినిమా తెలుగు వెర్షన్ కి పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఈ టీజర్ ఆగస్టు 20న విడుదల కాబోతోంది.

మరోవైపు మలయాళంలో కూడా సూపర్ స్టార్ మోహన్ లాల్ ఈ టీజర్ కు వాయిస్ ఓవర్ ఇచ్చారు. అయితే తాజా సమాచారం ప్రకారం కన్నడలో కూడా సైరా టీజర్ విడుదల కాబోతోంది. దాని కోసం దర్శక నిర్మాతలు కేజిఎఫ్ స్టార్ యష్ తో వాయిస్ ఓవర్ చేయించాని సమాచారం.

ఈ స్టార్ హీరోల వల్ల సైరా సినిమాకి ఆయా భాషల్లో మంచి ఇమేజ్ లభించనుంది. కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై రామ్ చరణ్ స్వయంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 2న విడుదల కాబోతుంది.